విజయవాడ: ఓ వ్యక్తి తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడినని చెబుతూ యువతను మోసం చేశాడు. వైఎస్ భారతి పీఏనని చెప్పి పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి పలువురిని మోసం చేశాడు. 

అఖిల్ విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందినవాడు. ఐసీఐసీఐ బ్యాంకులో కొంత కాలం డిప్యూటీ మేనేజర్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఖాళీగా ఉంటున్నాడు. నిరుడు అక్టోబర్ లో తిరుమలలో గదుల కోసం జగదీష్ సత్యశ్రీరాం అనే వ్యక్తిని ఫోన్ లో సంప్రదించాడు. అతడితో మాట్లాడి గదులు తీసుకున్నాడు. 

మాటల సందర్భంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే తనను సంప్రదించవచ్చునని, తాను వైఎస్ భారతి వద్ద పీఏగా పనిచేస్తున్నానని సత్యశ్రీరాం చెప్పాడు. అది నిజమేనని నమ్మిన అఖిల్ అతని విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో సహా రూ.60 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఇవ్వాలంటూ సత్యశ్రీరాం వద్ద అతని వద్ద మరికొంత డబ్బు లాగాడు. 

అలా మొత్తం లక్షా 12 వేల 500 రూపాయలు అఖిల్ నుంచి రాబపట్టుకన్నాడు. అయితే, అతను వైఎస్ భారతి పిఏ కాదని అఖిల్ కు తర్వాత తెలిసింది. తనతో పాటు మరో ఇద్దరు కూడా ఉద్యోగాల పేరిట సత్యశ్రీరాం చేతిలో మోసపోయినట్లు తెలుసుకుని భవానీపురం పోలీసులను అశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.