విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడి వుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశగా ఒంపు తిరిగిందని... దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి కేరళను తాకాయని భారత వాతావరణ శాఖా ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రుతుపవనాల్లో త్వరితమైన కదలికలు ఏర్పడి కేరళను తాకేలా చేశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో సకాలంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాల్లోకి ప్రవేశించి వ్యాప్తి చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు.