సంతనూతలపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE
Santhanuthalapadu assembly elections result 2024 : ఆంధ్ర ప్రదేశ్ లో బడుగు బలహీనవర్గాలైన ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం సంతనూతలపాడు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం టిజెఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసిపిదే విజయం. మరి ఈసారి సంతనూతలపాడు ఓటర్ల మూడ్ ఎలా వుంది? ఏ పార్టీని గెలిపిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
Santhanuthalapadu assembly elections result 2024 :
సంతనూతలపాడు రాజకీయాలు :
సంతనూతలపాడు నియోజకవర్గంపై వైసిపికి మంచి పట్టుంది. ఇక్కడ 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో టిజెఆర్ సుధాకర్ బాబులు వైసిపి నుండి పోటీచేసి విజయం సాధించారు. అంటే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టిడిపి గెలిచింది లేదు. అంతకుముందు 1983, 1985,1999 ఎన్నికల్లో మాత్రమే సంతనూతలపాడులో టిడిపి గెలిచింది.
ఈసారి ఎలాగైన సంతనూతలపాడులో పాగా వేయాలని టిడిపి... పట్టు నిలుపుకుని విజయపరంపర కొనసాగించాలని వైసిపి భావిస్తున్నారు. అందువల్లే ఇరుపార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. చూడాలి ఈసారి సంతనూతలపాడులో ఏ పార్టీ జెండా ఎగురుతుందో.
సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. నాగులుప్పలపాడు
2. మద్దిపాడు
3. చీమకుర్తి
4. సంతనూతలపాడు
సంతనూతలపాడు అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,11,557
పురుషులు - 1,04,737
మహిళలు - 1,06,812
సంతనూతలపాడు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడు బరిలో దింపింది వైసిపి. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు మరో అవకాశం ఇవ్వలేదు.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్ కు మారోసారి అవకాశం ఇచ్చింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈయన ఓటమిపాలయ్యారు... అయినాకూడ ఈయననే మరోసారి పోటీలో నిలిపారు టిడిపి అధినేత చంద్రబాబు.
సంతనూతలపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
సంతనూతలపాడు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,80,290 (85 శాతం)
వైసిపి - టిజెఆర్ సుధాకర్ బాబు - 89,160 ఓట్లు (49 శాతం) - 9,078 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి- బిఎన్ విజయ్ కుమార్ - 80,082 ఓట్లు (44 శాతం) - ఓటమి
సంతనూతలపాడు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,67,888 (83 శాతం)
వైసిపి - ఆదిమూలపు సురేష్- 80,954 (48 శాతం) - 1,276 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - బిఎన్ విజయ్ కుమార్ - 79,678 (47 శాతం) ఓటమి
- Adimulapu Suresh
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Congress
- Andhra Pradesh Elections 2024
- Bommaji Niranjan Vijay Kumar
- JSP
- Janasena Party
- Meruga Nagarjuna
- Nara Chandrababu Naidu
- Pawan Kalyan
- Santhanuthalapadu Assembly
- Santhanuthalapadu Politics
- Santhanuthalapadu assembly elections result 2024
- TDP
- TDP Janasena Alliance
- TDP Janasena BJP
- Telugu Desam party
- Telugu News
- YCP
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP