కేంద్రానికే షాక్ ఇచ్చిన చంద్రబాబు

Sambasiva rao appointment as full time dgp is illegal
Highlights

  • మొత్తానికి అనుకున్న దిశలోనే చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు.  
  • కేంద్రంతో సంబంధం లేకుండానే చంద్రబాబు సొంత నిర్ణయం తీసేసుకున్నారు.

మొత్తానికి అనుకున్న దిశలోనే చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు.  కేంద్రంతో సంబంధం లేకుండానే చంద్రబాబు సొంత నిర్ణయం తీసేసుకున్నారు. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే  కేంద్రంతో ఢీ కొనడానికే సిఎం నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. ముఖ్యమంత్రి తాజా నిర్ణయం కేంద్రాన్ని ధిక్కరిస్తున్నట్లు స్పష్టంగా అర్ధమైపోతుంది. అసలే, కేంద్రంతో చంద్రబాబుకున్న సంబంధాలు అంతంతమాత్రమే. అటువంటిది కేంద్రం ఆక్షేపించినా లెక్క చేయకుండా పోలీసుబాస్ విషయంలో సొంత నిర్ణయం తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. కేంద్రాన్ని ధిక్కరించి డిజిపి నియామకం చేయటం రాష్ట్రచరిత్రలో బహుశా ఇదే మొట్టమొదటి సారేమో.

మరో నెలన్నరలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఇన్ చార్జి డిజిపి నండూరి సాంబశివరావును చంద్రబాబు శుక్రవారం రెగ్యులర్ డిజిపిగా నియమించారు. ఇదే పేరును కేంద్రం గతంలో రెండుసార్లు రెజెక్ట్ చేసింది. దాదాపు ఏడాదిన్నరగా సాంబశివరాను రెగ్యులర్ డిజిపిగా నియమించని చంద్రబాబు మరో నెలన్నరలో రిటైర్ అవ్వబోతున్న సమయంలో రెగ్యులర్ డిజిపిగా నియమించాలను ఎందుకు అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. అదే విషయాన్ని కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది. సుప్రింకోర్టు మార్గద్శకాల ప్రకారం కనీసం రెండేళ్ళ సర్వీసు ఉన్న వాళ్ళని మాత్రమే పూర్తిస్ధాయి డిజిపిగా నియమించాలి.

నిబంధనలన్నీ చంద్రబాబుకు తెలిసినా కేంద్ర నిర్ణయాన్ని లెక్క చేయకుండా తన సొంత నిర్ణయాన్ని తీసేసుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రప్రభుత్వం పంపిన జాబితాలో నుండి ముగ్గురు పేర్లను యుపిఎస్సీ ఎంపిక చేసి తిరిగి రాష్ట్రప్రభుత్వానికి పంపుతుంది జాబితాను. అందులో నుండి తనకు ఇష్టమైన వ్యక్తిని ముఖ్యమంత్రి డిజిపిగా నియమిస్తారు. ఇప్పటి వరకూ జరుగుతున్న విధానమిదే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించటంతో కేంద్రానికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంది.

అధికారవర్గాల ప్రకారం నండూరి సాంబశివరావును పూర్తిస్ధాయి డిజిపిగా చంద్రబాబు నియమించటం నిబందనలకు విరుద్ధం. చంద్రబాబు నియామకం విషయం ఇప్పటికే కేంద్రం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో తన చెప్పు చేతల్లో ఉండే వ్యక్తే పోలీసుబాసుగా ఉండాలని చంద్రబాబు అనుకోవటంతోనే కేంద్రాన్ని ధిక్కరిచటానికి సాహసించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.

 

loader