ఏపీలో స‌ల్మాన్ 'భ‌జరంగీ భాయిజాన్' సీన్ రిపీట్.. 5 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిసిన బాలుడు !

Vijayawada: జూన్ 12, 2018న రంజాన్ మాసంలో తన స్నేహితులతో క‌లిసి ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఒక బాలుడు మ‌ళ్లీ 5 ఏండ్ల త‌ర్వాత యాదృచ్ఛికంగా అతను పవిత్ర రంజాన్ మాసంలోనే తన కుటుంబాన్ని మ‌ళ్లీ కలుసుకున్నాడు. 
 

Salman Khan's 'Bajrangi Bhaijaan' scene repeat in Vijayawada, AP Boy reunited with family after 5 years

Boy reunited with family after 5 years: జూన్ 12, 2018న రంజాన్ మాసంలో తన స్నేహితులతో క‌లిసి ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఒక బాలుడు మ‌ళ్లీ 5 ఏండ్ల త‌ర్వాత యాదృచ్ఛికంగా అతను పవిత్ర రంజాన్ మాసంలోనే తన కుటుంబాన్ని మ‌ళ్లీ కలుసుకున్నాడు. చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ నాగేశ్వర్ రావు విజయవాడ ఇంద్రా నగర్ లో బాలుడి కుటుంబాన్ని వెతుక్కుంటూ ఇంటింటికీ వెళ్లారు బాలుడిని కుటుంబంతో క‌లిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కొన్ని సంఘ‌ట‌న‌లు తెర‌మీద క‌నిపించే దృశ్యాల మాదిరిగానే నిజ జీవితంలోనూ చోటుచేసుకుంటుంటాయి. ఇదే త‌ర‌హాలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన భ‌జ‌రంగీ భాయిజాన్ త‌ర‌హా సీన్ ఒక‌టి నిజ జీవితంలో రిపీట్ అయింది. తెర‌మీద క‌నిపించిన సల్మాన్ లాగే.. చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ ఒక బాలుడిని 5 ఏండ్ల త‌ర్వాత త‌న కుటుంబంతో క‌లిపాడు. దీంతో సంతోషంలో మునిగిన  బాలుడు, ఆ కుటుంబ ఆనందానికి అవధుల్లేవు.. ! ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విజయ‌వాడ‌లో చోటుచేసుకుంది. 

ఐదేళ్ల క్రితం అదృశ్యమైన 15 ఏళ్ల బాలుడు మహ్మద్ బాషా విజయవాడలోని తన కుటుంబ సభ్యులతో తిరిగి కలిసేందుకు చిల్డ్రన్స్ హోమ్ ఫర్ బాయ్స్ సూపరింటెండెంట్ నాగేశ్వ‌ర్ రావు సహాయం చేశారు. 2018 జూన్ 12న రంజాన్ మాసం సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకుంటూ బాలుడు అదృశ్యమయ్యాడు. యాదృచ్ఛికంగా, పవిత్ర మాసంలో అతను తన కుటుంబంతో తిరిగి కలిశాడు.
ఆ బాలుడు విజయవాడలో రైలు ఎక్కి వరంగల్ లో దిగివుంటాడ‌ని భావిస్తున్నారు. పోలీసులు, చైల్డ్ లైన్ అతడిని రక్షించి వరంగల్ లోని ప్రభుత్వ హోంకు తరలించారు. అక్కడి సిబ్బంది అంచనా వేయగా అతనికి 40-50 శాతం మేధో వైకల్యం ఉందని గుర్తించి చికిత్స ప్రారంభించారు. అయితే అతను తన గత జీవితం గురించి చెప్పినవన్నీ బీబీ, బాషా, చెన్నై అనే మూడు మాటలు మాత్రమేనని చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ నాగేశ్వర్ రావు తెలిపారు.

2020 డిసెంబర్లో జువెనైల్ వెల్ఫేర్ వింగ్ పరిధిలోని హైదరాబాద్ చిల్డ్రన్ హోమ్ కు తరలించి నాగేశ్వర్ రావు సంరక్షణలో ఉంచారు. 'అయితే, అతడి నుంచి వివరాలు రాబట్టడం చాలా కష్టంగా మారింది. దీంతో మిస్సింగ్ చైల్డ్ రిక్వెస్ట్ ల‌ కోసం దర్పణ్ ఫేస్ రికగ్నిషన్ యాప్ ను పరిశీలించి, పోలీసు అధికారులతో సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆధారాల కోసం మూసారాంబాగ్ ఆధార్ కేంద్రాన్ని సంప్రదించాం' అని నాగేశ్వర్ రావు తెలిపారు. ఇక్కడే చిన్నారి కనుపాప స్కాన్ చేయగా అతని చిరునామా విజయవాడలోని ఇంద్రా నగర్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాత డోర్ నంబర్లన్నీ మార్చినట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించడంతో ఈ స‌మాచారం లీడ్ ఫెయిలైంది. 

అయితే, ఈ నెల 7న ఇంద్రానగర్ కు వెళ్లిన నాగేశ్వ‌ర్ రావు ఇంటింటి తిరిగి ఇదే విష‌యం గురించి తనిఖీ చేశారు. ఈ క్ర‌మంలోనే చివరకు ఒక చిరుతిండి విక్రేత ఆ పిల్లవాడిని గుర్తించాడు. చివ‌ర‌కు బాలుడిని కుటుంబం వ‌ద్ద‌కు చేర్చారు. "చిన్నారిని చూసిన ఆ కుటుంబం కన్నీళ్లు  పెట్టుకుంటూ బాలుడిని ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు. ఆ కుటుంబం పూర్తిగా నమ్మలేని స్థితిలో ఉంది. అది 'ఇఫ్తార్' సమయం. వారి సంతోష‌క‌ర‌మైన క‌న్నీళ్ల‌తో నాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వారి ఆహారాన్ని నాతో పంచుకున్నారు. వారి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెరిఫై చేశాను. వారు తప్పిపోయిన పోస్టర్లు కూడా తయారు చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు" అని రావు చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios