ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే జగన్ లక్ష్యమని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా రాజకీయ పార్టీలు ఉండాలని అన్నారు. ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ కార్యక్రమం పోస్టర్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభించనున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమం 14 రోజుల పాటు కొనసాగుతుందని.. ఏప్రిల్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. 80 శాతం మంది ప్రజలు రియల్ ఛేంజ్ కనిపిస్తుందని అంటున్నారు. జగన్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని.. తాము అనుకున్నదాని కంటే రెండింతలు ఆయన నిలబెట్టుకున్నారని తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ నినాదాలు ప్రజల నుంచి వచ్చిన నినాదాలు అని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన నినాదాన్నే కార్యక్రమం పేరుగా నిర్ణయించామని చెప్పారు. 

14 రోజుల్లో 1.60 కోట్ల కుటుంబాలకు వద్దకు గృహసారథులు, తమ కార్యకర్తలు వెళ్తున్నారని చెప్పారు. ఆ కుటుంబాలకు వాలంటీర్లలాగే.. వైసీపీ నుంచి గృహసారథులు కూడా ఉంటారని చెప్పారు. జగన్ సంక్షేమ రథానికి అడ్డుపడాలని ప్రతిపక్షాల పేరుతో కొన్ని శక్తుల చేస్తున్న కుట్రతో ఈ కార్యక్రమంతో చెక్ పడుతుందని అన్నారు.