చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది ‘టీడీపీ బాబాయ్’ మృతి..
స్కిల్ డెవల్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం, జైలు నుంచి ఇంకా బయటకు రాకపోవడంతో మనస్థాపం చెందిన ఓ టీడీపీ వీరాభిమాని మరణించారు. ‘టీడీపీ బాబాయ్’ గా పిలుచుకునే విశాఖపట్నంకు చెందిన పి.రాధాకృష్ణమూర్తి సోమవారం రాత్రి కన్నుమూశారు.

ఆయనకు చంద్రబాబు నాయుడు, టీడీపీ అంటే ఎంతో అభిమానం. అందుకే ఆయనను ‘టీడీపీ బాబాయ్’ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇటీవల స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావడం ఆయనను ఎంతో బాధపెట్టింది. అప్పటి నుంచి ఆయన బయటకు వస్తారని ఎదరుచూశారు. కానీ జైలు నుంచి ఇంకా బయటకు రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్థాపం చెంది మరణించారు.
పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వితంతువుపై 14 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. మత్తు మందు ఇచ్చి దారుణం..
ఈ ఘటన విశాఖపట్నంలో సోమవారం రాత్రి జరిగింది. షీలానగర్ కు చెందిన 82 ఏళ్ల పి.రాధాకృష్ణమూర్తి చాలా కాలం నుంచి టీడీపీ అభిమానిగా ఉన్నారు. అందుకే ఆయనను సిటీలో అందరూ ‘టీడీపీ బాబాయ్’ అని పిలుస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్టయిన నాటి నుంచి ఆయన ఆందోళన చెందుతున్నారు. పలువురు నాయకులకు ఫోన్ చేస్తూ చంద్రబాబు నాయుడికి బెయిల్ ఎప్పుడు లభిస్తుంది ? ఆయన బయటకు ఎప్పుడు వస్తారు అంటూ ప్రశ్నించేవారు. సోమవారం రాత్రి కూడా ఈ విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తరువాత మనస్థాపంతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు.
ప్రేమించడం లేదని యువతిపై కోపం.. దారుణ హత్య.. కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఘటన
నిరసన శిబిరంలో మరొకరు..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి, నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ శిబిరంలోనే మనస్థాపం చెంది ఓ టీడీపీ అభిమాని మరణించారు. చంద్రబాబు అరెస్టు నుంచి టీడీపీ వీరాభిమాని అయిన 62 ఏళ్ల కోటేశ్వరరావు ఆందోళన చెందుతున్నాడు. ఆయన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన వ్యక్తి. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. హుక్కా బార్లను నిషేధం.. వాటిపై కూడా..
చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ గుడ్లవల్లేరులోని టీడీపీ ఆఫీసు ఎదట మంగళవారం దీక్షా శిబిరంలో కూర్చున్నాడు. తీవ్ర మనస్థాపంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడి నాయకులు కోటేశ్వరరావును హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. కాగా.. చంద్రబాబు అరెస్టు పై ఆందోళన చెందుతూ, జైలులో ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అని కలత చెందుతూ ఆదివారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 7 గురు మరణించారు.