Asianet News TeluguAsianet News Telugu

సదావర్తి: ఉలిక్కిపడుతున్న ‘‘దేశం’’

  • సదావర్తి సత్రం...ఈ పేరు వింటేనే తెలుగుదేశంపార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారు.
  • 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో చంద్రబాబునాయుడును ఇంత ఇబ్బంది పెట్టిన విషయం బహుశా మరోకటి లేదేమో.
  • మూడు రోజుల క్రితమే వేలం వేసి తమ వాళ్ళకే విలువైన భూములు దక్కిందనుకున్న ఆశ కూడా ఎక్కువసేపు నిలవలేదు.
  • వేలంపాటలో అత్యధిక ధరకు పాడుకున్న సత్యనారాయణ బిల్డర్స్ డబ్బు చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవటంలో వెనక్కు తగ్గింది.
  • దాంతో సమస్య మళ్ళీ మొదటికి రావటంతో ఏం చేయాలో ప్రభుత్వంలోని ముఖ్యులకు అర్ధం కావటం లేదు.
Sadavarti lands become a nightmare for tdp leaders

సదావర్తి సత్రం...ఈ పేరు వింటేనే తెలుగుదేశంపార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో చంద్రబాబునాయుడును ఇంత ఇబ్బంది పెట్టిన విషయం బహుశా మరోకటి లేదేమో. మూడు రోజుల క్రితమే వేలం వేసి తమ వాళ్ళకే విలువైన భూములు దక్కిందనుకున్న ఆశ కూడా ఎక్కువసేపు నిలవలేదు. వేలంపాటలో అత్యధిక ధరకు పాడుకున్న సత్యనారాయణ బిల్డర్స్ డబ్బు చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవటంలో వెనక్కు తగ్గింది. దాంతో సమస్య మళ్ళీ మొదటికి రావటంతో ఏం చేయాలో ప్రభుత్వంలోని ముఖ్యులకు అర్ధం కావటం లేదు.

దశాబ్దాల పాటు చంద్రబాబుపై అనేక అవినీతి ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. అయినా ఏ ఒక్కటీ రుజువుకాలేదు. దాంతో తనకు తాను చంద్రబాబు సచ్చీలునిగా సర్టిఫికేట్ ఇచ్చేసుకుని చెలామణైపోతున్నారు. ఇటువంటి సమయంలో సదావర్తి భూముల కుంభకోణం ఒక్కసారిగా చంద్రబాబును చుట్టుముట్టింది. ఓ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర స్పష్టంగా బయటపడటం ఇదే మొదటిసారి. అందులోనూ వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసిన న్యాయపోరాటంలో ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది.

ఏదో గుట్టుచప్పుడు కాకుండా వందల కోట్ల రూపాయల విలువైన సదావర్తి సత్రం భూములను కారుచౌకగా కొట్టేదామనుకున్న వాళ్ళ పప్పులుడకలేదు. తమిళనాడులోని 84 ఎకరాల సత్రం భూములను చంద్రబాబు ప్రభుత్వం మరీ చౌకగా రూ. 22 కోట్లకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్యకు కట్టబెట్టేసింది. దాంతో ఆళ్ళ కోర్టులో కేసు వేయటం తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.

ఇక, తాజా విషయానికి వస్తే మూడురోజుల క్రితం జరిగిన వేలం పాటలో శ్రీనివాసరెడ్డి అనే బిల్డర్ సత్రం భూములను రూ. 60.30 కోట్లకు దక్కించుకున్నారు. ఈయన కూడా టిడిపి నేతలకు సన్నిహితుడే. దాంతో టిడిపి నేతల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. వైసీపీని ఎగతాళి చేస్తూ ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే, ఆ ఆనందం రెండు రోజులు కూడా నిలవ లేదు. తనకు సత్రం భూములు వద్దంటూ బిల్డర్ తేల్చి చెప్పారు. అధిక ధరను చెల్లించి భూములు తీసుకోవటానికి నిరాకరించటంతో సత్రం భూముల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.

దానికితోడు భూముల వేలంలో ప్రభుత్వ పాత్రను ప్రశ్నిస్తూ సుప్రింకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. అవన్నీ 22వ తేదీ విచారణకు రానున్నాయి. దాంతో చంద్రబాబులో కలవరం మొదలైంది. మొత్తానికి సదావర్తి భూముల వ్యవహారం చంద్రబాబు మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనంటూ పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios