నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం.. ఎంఐసీయూ వార్డులో ఒకే రోజు ఆరుగురు మృతి..!!
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంఐసీయూ వార్డులో ఒకే రోజు ఆరుగురు మృతిచెందారు.
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంఐసీయూ వార్డులో ఒకే రోజు ఆరుగురు మృతిచెందారు. అయితే ఆక్సిజన్ అందకనే వారు చనిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. అనారోగ్య కారణాల వల్లే వారు చనిపోయారని చెబుతుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది లేదని పేర్కొంది. మృతికి కారణాలపై విచారణ జరుపుతున్నామని చెప్పింది. ఈ మేరకు తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవీ రిపోర్ట్ చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.