అమరావతి నిర్మాణ పనుల్లో అపశ్రుతి: చిన్నారులను బలి తీసుకున్న గుంత

Sad incident in Amaravati road construction works
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమరావతి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తవ్విన నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మరణించారు. 

తుళ్లూరు మండలం దొండపాడులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.  నీటి ఊబిలో చిక్కుకున్న మరో ఏడుగురిని స్థానికులు రక్షించారు. 

మృతులను ఉప్పలపాటి అమల (9), రమేష్ (6), బండి సాత్విక్ (6)లుగా గుర్తించారు. తమ పిల్లల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

loader