తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ సబ్బంహరి తనదైన శైలిలో స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే పవన్ కల్యాణ్, జగన్ కలిసి పోటీచేస్తే చంద్రబాబు పరిస్థితి క్లిష్టంగా మారుతుందన్నారు. చంద్రబాబు గిఫ్ట్ ఇస్తే కేసీఆర్ సీఎం అయ్యారు.. అలాగే కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే బాబు ఏపీలో ముఖ్యమంత్రి అవుతారని సబ్బం వ్యాఖ్యానించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ విజయం కోసం బీజేపీ శాయశక్తులా కృషి చేసిందని ఆయన ఆరోపించారు. నేడు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు, ఎజెండాలు లేవని.. ఎవరు ఎవరితోనైనా కలవొచ్చు అంటూ సబ్బం అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల తర్వాత తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి రాబోతున్నట్లు సబ్బం తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది అతి త్వరలో ప్రకటిస్తానని సబ్బం హరి వెల్లడించారు. 

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక