ఇక్బాల్ కు జగన్ షాక్: దీపికకు పిలుపు, ఇంతకీ ఎవరీమె?
Hindupuram: హిందూపురం రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారాయి. దీనికి అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణం కావడం గమనార్హం. హిందూపురం అధికార పార్టీ వర్గాల్లో చీలకలు వచ్చాయా? ఏదో ఒక వర్గం నుంచి ఆసమ్మతి సెగ తగలనుందా? సీఎం జగన్ దీపకను సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌చార్జిల సమీక్షకు పిలవడానికి గల కారణాలేంటి? అనే ప్రశ్నలపై హిందూపురం రాజకీయాల్లో చర్చ సాగుతోంది.
YSRCP-Hindupuram: హిందూపురం రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారాయి. దీనికి అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హిందూపురం అధికార పార్టీ వర్గాల్లో చీలకలు వచ్చాయా? ఏదో ఒక వర్గం నుంచి ఆసమ్మతి సెగ తగలనుందా? సీఎం జగన్ దీపకను సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌చార్జిల సమీక్షకు పిలవడానికి గల కారణాలేంటి? అనే ప్రశ్నలపై హిందూపురం రాజకీయాల్లో చర్చ సాగుతోంది.
వివరాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌చార్జిల సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షకు హిందూపురం నుంచి పార్టీ నాయకురాలు దీపికకు పిలుపు వచ్చింది. అయితే, అక్కడి ఇన్‌చార్జి ఇక్బాల్‌ను ఉండగా దీపికకు పిలుపు రావడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కొనసాగుతున్నారు. అయితే, తాజా సమీక్షకు ఆయనతో పాటు పార్టీకి చెందిన మహిళా నాయకురాలు దీపికకు పిలుపు వచ్చింది. ఇప్పుడు ఇదే అంశం అధికార పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇదే విషయంలో ఇక్బాల్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గ ఇన్‌చార్జిని కాదనీ ఆ పార్టీ నాయకురాలు దీపికను ఆహ్వానించడంపై అధికార పార్టీ వర్గాల్లోనూ జోరు చర్చ సాగుతోంది. హిందూపురం నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి ఇక్బాల్‌తోపాటు వైసీపీ నాయకురాలు దీపికకు పిలుపురావడం, సమావేశంలో ముందు వరుసలో, మంత్రుల జతలో కూర్చున్నారని సమాచారం. ఇప్పుడే ఇదే విషయంపై ఇక్బాల్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీని కాదని ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిస్థితులే తాజా పరిణామాలను కలిగించాయని తెలుస్తోంది. ఇటీవల ఇక్బాల్ వర్గం హిందూపురంలో ర్యాలీలు చేయడం కూడా దీనిలో భాగంగానే జరిగినట్టు చూడవచ్చు. ఎందుకంటే ఇక్బాల్‌ను కాదని మరొకరికి అవకాశం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించడం గమనార్హం.
తాజా పరిణామాలపై ఎమ్మెల్సీ ఇక్బాల్ కు దూరంగా ఉండే రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ వర్గంతోపాటు చౌళూరు రామక్రిష్ణారెడ్డి సోదరి మధుమతి వర్గీయులు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఎందుకు అనేది చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. డైరెక్టుగా సీఎం చర్చలు పార్టీలోని అగ్రనేతల ఆగ్రహాన్ని తెప్పించడంతో వారు చక్రం తిప్పారని ఇక్బాలు మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. రాయలసీమ కో ఆర్డినేటర్‌గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గ ఇన్‌చార్జిగా దీపికను ప్రకటించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే సమీక్షకు ఆహ్వానించారని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే, హిందూపురంలో దీపికకు ఏ వర్గంతోనూ పెద్దగా విభేధాలు లేవని వైకాపా అధిష్టానం భావించే రాబోయే ఎన్నికల ప్రణాళికలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.