గుంటూరు: కరోనాతో బాధపడుతూ ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సరయిన వైద్యం అందుక సత్తెనపల్లికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. అయితే కరోనాతో మృతిచెందిన అతడి అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబం ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే చివరి క్రతులు నిర్వహించారు.  

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నివాసముండే ఆర్టీసీ డ్రైవర్ కరోనా లక్షణాలతో బాధపడుతూ టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్ట్ లో అతడికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఈనెల26వ తేదిన పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అయితే అక్కడ వెంటిలేటర్ లేకపోవడంతో 27వ తేదీన గుంటూరు లోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. 

read more   బోగస్ కరోనా లెక్కలతో జగన్ సర్కారు మోసం: చంద్రబాబు

కానీ అక్కడ కూడా వైద్య సాకర్యాలు సరిగా లేవని 28న మంగళగిరి కోవిడ్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ బెడ్లు ఖాళీ లేవని చెప్పటంతో విజయవాడ ఆసుపత్రిలో సంప్రదించాడు.అక్కడ కూడా సానుకూల స్పందన రాలేదు. ఇలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగి విసిగిపోయిన అతడు తీవ్ర అనారోగ్యంతోనే 29వ తేదిన ఇంటికి చేరుకున్నాడు. 

ఈ క్రమంలో గురువారంనాడు శ్వాస సమస్య తీవ్రమై ఇంట్లోనే మరణించాడు. అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో  మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు.