తీరా చూస్తే.. ఆ డబ్బులను సగం చెదలు తినేశాయి. దీంతో.. తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందేనని కన్నీరు మున్నీరయ్యాడు. 

అతను ప్రతిరోజూ కష్టం చేసుకునేవాడు. ఎప్పటికైనా సొంతిల్లు కట్టుకోవాలి అనేది అతని కల. అందుకోసం అతను చేయని ప్రయత్నమంటూ లేదు. రోజూ రూపాయి రూపాయి కూడపెట్టి.. దానిని భద్రంగా ఓ పెట్టెలో దాచుకునేవాడు. రెండు సంవత్సరాలు కష్టపడి దాదాపు రూ.5లక్షలు పోగు చేశాడు. వాటిని తీసి.. ఇంటి పనులు మొదలుపెడదామని భావించాడు. తీరా చూస్తే.. ఆ డబ్బులను సగం చెదలు తినేశాయి. దీంతో.. తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందేనని కన్నీరు మున్నీరయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మైలవరం గ్రామంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మైలవరం గ్రామానికి చెందిన జమలయ్య.. విజయవాడ రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు చిన్నగా ఉండటంతో రూ.10లక్షలతో మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. వ్యాపారంలో వచ్చే రోజువారీ డబ్బును ఇంట్లోని ఓ పెట్టెలో గత రెండు సంవత్సరాలుగా దాచిపెడుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు రూ.5లక్షలు పోగు చేశాడు. 

కాగా.. తన వ్యాపారం నిమిత్తం అతనికి లక్ష రూపాయలు అవసరమయ్యాయి. వెంటనే వాటిని తెచ్చుకుందామని వెళ్లి ఇంట్లోని పెట్టె తెరవగా.. అవన్నీ చెదలు పట్టేసి ఉండటం గమనార్హం. చెదలు సగానికి సగం డబ్బులను తినేశాయి. దీంతో. .. తన రెండేళ్ సంపాదన వ్యర్థమయ్యందని అతను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.