Asianet News TeluguAsianet News Telugu

Rosaiah Vs Chandrababu: అలా అయితే.. ఎప్పుడో వైఎస్‌ను పొడిచేవాడిని.. చంద్రబాబుపై రోశయ్య భయంకరమైన పంచులు..

చాలా సౌమ్యుడిగా కనిపించే రోశయ్య (Konijeti Rosaiah).. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ తన వాగ్దాటితో ప్రతిపక్ష సభ్యులపై పంచుల వర్షం కురిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రోశయ్య.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై (Chandrababu Naidu) ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.  

Rosaiah Extraordinary Punches on Chandrababu in Assembly
Author
Hyderabad, First Published Dec 5, 2021, 11:03 AM IST

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతను ప్రదర్శించిన రోశయ్య.. పార్టీలో ముఖ్యులకు తలలో నాలుకలా వ్యవహరించేవారు. గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా.. ఇలా ప్రతి పదవిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.అధికారంలో ఉన్నప్పుడు తనదైన వాగ్దాటితో ప్రతిపక్షాలను కట్టడి చేయడమే కాకుండా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీకి విమర్శనాలు సంధించడంలో రోశయ్య దిట్ట. 

కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి పరిస్థితి వచ్చిన దానిని ఎదుర్కొవడంలో రోశయ్య తన వంత సూచనలు, సలహాలు ఇస్తుండేవాడు. అసెంబ్లీలో పార్టీ‌పై ప్రత్యర్థులు చేసే విమర్శలు తనదైన మాటలతో తిప్పికొట్టేవారు. 1983‌లో భారీ మెజారిటీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాంగ్రెస్ తరఫున శాసనమండలిలో గట్టిగా పోరాడి సత్తా చాటారు. ఒక రకంగా అప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న రోశయ్య.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన బలమైన రాజకీయ వ్యాఖ్యలు చివరకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (NT Rama Rao) మండలి రద్దుకు దారితీసేలా చేశాయి.

చాలా సౌమ్యుడిగా కనిపించే రోశయ్య.. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ తన వాగ్దాటితో ప్రతిపక్ష సభ్యులపై పంచుల వర్షం కురిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రోశయ్య.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.  భయంకరమైన పంచులతో ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. తన వాగ్దాటితో ప్రతిపక్షం నోట మాట రాకుండా చేశారు. 

Also read: మా మధ్య రాజకీయ వైరుధ్యమే ఉంది: రోశయ్యకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వెన్నుపోటు పొడవలేదు.. 
ఒక సందర్భంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు (TDP members) రోశయ్యకు కోపం ఎక్కువైందని, తెలివి తేటలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించడం రోశయ్య తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘ఏ డ్రామా కంపెనీలో కత్తి పట్టుకుని నిల్చునే పాత్రను చేయలేదు. తెలివి తేటలు ఎక్కువైతే ఇలా అయితే నేను ఇలా ఉంటానా..?. నన్ను నమ్మిన రాజశేఖర‌రెడ్డిని ఎప్పుడో ఒకసారి పొడిచి.. కుర్చీ ఎక్కేవాడిని. అంతకు ముందు చెన్నారెడ్డిని, భాస్కర్‌ రెడ్డిని వెన్నుపోటు పొడిచి ఉండేవాడిని’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

అల్లుడిపై ఆరోపణలు వచ్చినప్పుడు..
విశాఖపట్నంలో రోశయ్య అల్లు పేకాట ఆడుతూ పట్టుబడటం అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు రోశయ్య అల్లుడిని టార్గెట్ చేశారు. దాదాపు అరగంట పాటు ఇదే అంశాన్ని టీడీపీ సభ్యులు ప్రస్తావించారు. అయితే దీనిపై స్పందించేందుకు సీటు నుంచి లేచిన రోశయ్య.. చంద్రబాబు నాయుడుపై (Chandrababu Naidu), ప్రతిపక్ష టీడీపీపై తనదైన శైలిలో దాడి చేశారు. ‘మీలో చాలా మందిలో బట్టలు తెలియకుండా తాగి పోర్లాడే బాపతు కాదు నేను.. మీరా మాట్లాడేది నా అల్లుడు అని చెప్పే ధైర్యం లేక.. ఓ మంత్రి అల్లుడు అని చెబుతున్నారు. నాకు గానీ, ఎన్టీ రామారావుకు గానీ దేవుడు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’ అంటూ రోశయ్య టీడీపీపై ఎదురుదాడి చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios