Asianet News TeluguAsianet News Telugu

మా మధ్య రాజకీయ వైరుధ్యమే ఉంది: రోశయ్యకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. 

Union Minister Kishan Reddy Pays tributes to Rosaiah
Author
Hyderabad, First Published Dec 5, 2021, 9:32 AM IST

హైదరాబాద్:  మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు తనకు మధ్య రాజకీయ వైరుధ్యం మాత్రమే ఉందని, రాజకీయంగా శతృవులం కాదని కేంద్ర మంత్రి Kishan Reddy చెప్పారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి Roshaiah  బౌతిక కాయం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నాడు నివాళులర్పించారు.  శనివారం నాడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణించాడు. ఇవాళ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆయన చెప్పారు. తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో Bjp  సీనియర్ నేత వి. రామారావు శాసనమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో మండలికి వెళ్లేవాడినని కిషన్ రెడ్డి చెప్పారు.

also read:Konijeti Rosaiah Last rites: రేపు కొంపల్లిలో రోశయ్య అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాట్లకు ఆదేశం..

 మండలిలో Ramarao, రోశయ్యలు అత్యంత స్నేహంగా ఉండేవారని  ఆయన గుర్తు చేశారు. రోశయ్య ఇంటికి రామారావు భోజనానికి వెళ్లేవాడని, రామారావు ఇంటికి రోశయ్య వచ్చేవాడని ఆయన చెప్పారు. ys rajashekar Reddy ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు కవచంగా రోశయ్య పనిచేశారని కిషన్ రెడ్డి చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో కూడా రోశయ్యతో కలిసి అసెంబ్లీలో ప్రతి రోజూ కలిసేవాడినని చెప్పారు.   అసెంబ్లీలోనూ వ్యక్తిగతంగా తాను లేవనెత్తే అంశాలపై రోశయ్య అభినందించేవాడని  కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

అవినీతి మచ్చలేని నేత: బండి సంజయ్

ఆర్ధిక శాఖ మంత్రి అంటే రోశయ్య అనే  ముద్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay చెప్పారు. 
ఏ శాఖ చేపట్టినా కూడా రోశయ్యపై అవినీతి ఆరోపణలు  రాలేదని సంజయ్ చెప్పారు. స్వంత పార్టీలో కూడా అందరిని కలుపుకొని పోయిన చరిత్ర రోశయ్యకు ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రజల . సమస్యలు తెలుసుకొని పరిష్కరించేవారన్నారు. రోశయ్యను తాను ఎప్పుడూ కలుసుకోలేదన్నారు. .అయితే ఆయన ఆలోచన విధానాన్నితెలుసుకొన్నానని చెప్పారు.  రోశయ్య ఆత్మశాంతికి కలగాలని కోరుకొంటున్నానని తెలిపారు.  రోశయ్య . కుటుంబానికి దేవుడు మనో ధైర్యం కలిగించాలని కోరుకొంటున్నట్టుగా సంజయ్ చెప్పారు.

అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోశయ్య ఇంటి నుండి పార్థీవ  దేహన్ని గాందీ భవన్ కు తరలించనున్నారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు బౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు.  కొంపల్లిలోని తన ఫామ్ హౌస్ లో రోశయ్య అంత్యక్రియలను నిర్వహిస్తారు. ప్రతీ ఏటా కార్తీక మాసంలో ఈ ఫాం హౌస్ లో కార్తీక వన భోజనాలు నిర్వహించేవారు. గత ఏడాది కూడా ఈ వన భోజనాల కార్యక్రమంలో రోశయ్య పాల్గొన్నారు. కానీ ఈ ఏడాది ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. నడవడానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో రోశయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.  ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణలు రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios