రాయదుర్గంలోని మురిడి అంజన్నఆలయంలో అర్చకుడిగా పని చేసే అనంతసేన మహిళా భక్తులతో రాసలీలలు చేస్తున్నారని అతడి భార్య ఆరోపించారు. తనను వేధింపులకు గురి చేశాడని పేర్కొంటూ ఆమె పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లాలోని ప్రఖ్యాత మురిడి అంజన్న మందిరంలో అర్చకుడిగా పని చేసే అనంతసేన రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింది. అతడి భార్య స్రవంతి ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లాలోని డి.హేరేహాల్ పట్టణంలో అనంతసేన అర్చకుడిగా పని చేస్తున్నారు. ఆయనకు 2008 సంవత్సరంలో కర్నూల్ జిల్లాలోని రంగాపురం గ్రామానికి చెందిన స్రవంతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా కాలం వరకు వీరి దాంపత్యం జీవితం చాలా చక్కగా సాగింది. అయితే కొంత కాలం తరువాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీనిని భార్య గమనించింది.
కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద: సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
అనంతసేన తను పని చేస్తున్న ఆలయానికి వచ్చే మహిళలను మంత్ర శక్తుల పేరు చెప్పి లోబర్చుకునేవాడు. కొందరితో రాసలీలలను కొనసాగించేవాడు. ఇదే సమయంలో ఇటు భార్యను వేధింపులకు గురి చేసేవాడు. తన ఆలయానికి వచ్చే వాళ్లు చాలా అందగా ఉంటావని ఆమెకు చెప్పేవాడు. వారిలా నువ్వు లేవని మానసికంగా హింసించేవాడు. అలాగే ఇంకా కట్నం కావాలని ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పేవాడు.
చంద్రబాబు, టీడీపీ నేతలతో ఎన్డీయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ (ఫోటోలు)
దీంతో ఆమె కోపంతో సంవత్సరం కిందట తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. కానీ ఇరు పక్షాల పెద్దలు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఆమెను కాపురానికి పంపించారు. కొంత కాలం తరువాత భర్త ఫోనులోని ఉన్న ఫొటోలు చూసి స్రవంతి షాక్ అయ్యింది. అందులో ఇతర మహిళల ఫొటోలు, వారితో రాసలీలల సమయంలో దిగిన ఫొటోలు చూసి ఆందోళనకు గురయ్యింది. ఇదేంటని భర్తను నిలదీసింది. అయినా అనంతసేన పట్టించుకోలేదు. అతడి ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు. దీంతో ఆమెను చంపేయాలని భావించింది. ఈ విషయంతో తెలియడంతో రాత్రి సమయంలోనే బిడ్డలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
జెరూసలేం యాత్ర స్కీంలో అవకతవకలు.. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు , రంగంలోకి ఏపీ సీఐడీ
ఈ ఘటనలు జరిగిన తరువాత ఆమెను వదిలించుకోవడానిక అనంతసేన భార్యకు విడాకుల నోటీసులు పంపించారు. అందులో ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని పేర్కొన్నాడు. అందుకే విడాకులు కోరుతున్నట్టు అందులో తెలియజేశాడు. ఈ విషయంపై మట్లాడేందుకు భార్య తన కుటుంబ సభ్యులను, అలాగే బంధువులను తీసుకొని మంగళవారం భర్త ఇంటికి వచ్చింది. అనంతసేను ప్రవర్తనను మార్చుకోవాలని పెద్దలు చెప్పారు. ఈ సమయంలో అతడి ఫోన్ లో నుంచి సేకరించిన ఇతర మహిళల ఫొటొలు, వారిని ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న ఫొటోలను ఆమె అందరికీ చూపించింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే ఈ సమయంలో ఆమె భర్త, అత్తమామలు దాడికి ప్రయత్నించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను గాయపరిచారని ఆరోపించారు. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని అంతా పోలీసుకు చెప్పి, ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఆమె ఫిర్యాదును స్వీకరించామని రాయదుర్గం రూరల్ సీఐ యుగంధర్ తెలిపారు.
