జెరూసలేం యాత్ర స్కీంలో అవకతవకలు జరిగినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఏపీ క్రిస్టియన్ మైనార్టీ సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  2018-19కి సంబంధించిన డేటాను తీసుకున్నారు అధికారులు 

ఏపీ క్రిస్టియన్ మైనార్టీ సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జెరూసలేం యాత్ర స్కీంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు జరిపారు. రూ.6 కోట్ల నిధులు గోల్ మాల్ అయినట్లుగా డీజీపీ, సీఐడీ, ఏసీబీకి ఓ అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. 2018-19కి సంబంధించిన డేటాను తీసుకున్నారు అధికారులు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.