పిప్పళ్ళ బస్తా లాంటి లోకేష్ ను, ఫిరాయింపు ఎంఎల్ఏలను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో బరువులో తేడా వచ్చిందట. ఎక్కడైనా, ఏ దిక్కులోనైనా బరువులో తేడా వస్తేనే వాస్తు దోషాలుంటాయని చెప్పారు. చంద్రబాబునాయుడు కాని పనులు చేస్తున్న కారణంగానే ఎక్కడో బరువు పెరిగిపోయి మొత్తం సచివాలయానికే వాస్తు దోషం పట్టుకుందన్న విషయాన్ని స్పష్టం చేసారు.

కొత్తగా కట్టిన వెలగపూడి సచివాలయానికి వాస్తు ఎందుకు సరిగా లేదో వైసీపీ ఎంఎల్ఏ, ఫైర్ బ్రాండ్ రోజా ఈరోజు చెప్పారు. సచివాలయానికి వాస్తు సరిగాలేదని ఒకటికి పదిసార్లు మార్పులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా? కొత్తగా కట్టిన సచివాలయానికి వాస్తు ఎందుకు సరిగా లేదని వాస్తు పండితులు ఎంతోమంది ఆలోచించినా అర్ధం కాలేదు. చివరకు రోజా ఈరోజు కారణం చెప్పారు.

వైసీపీ ప్లీనరీ సందర్భంగా రోజా మాట్లాడుతూ, సచివాలయానికి వాస్తు సరిగా లేకపోవటానికి కారణం నారా లోకేష్, ఫిరాయింపు మంత్రులేనట. పిప్పళ్ళ బస్తా లాంటి లోకేష్ ను, ఫిరాయింపు ఎంఎల్ఏలను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో బరువులో తేడా వచ్చిందట. ఎక్కడైనా, ఏ దిక్కులోనైనా బరువులో తేడా వస్తేనే వాస్తు దోషాలుంటాయని చెప్పారు.

చంద్రబాబునాయుడు కాని పనులు చేస్తున్న కారణంగానే ఎక్కడో బరువు పెరిగిపోయి మొత్తం సచివాలయానికే వాస్తు దోషం పట్టుకుందన్నారు. కాని పనులు చేయకుండా చంద్రబాబు సక్రమంగా పాలన చేసి ఉండుంటే వాస్తు దోషాలు వచ్చేవి కావని కూడా సూచన చేసారులేండి. కాబట్టి చంద్రబాబు ఈ విషయమై కాస్త ఆలోచిస్తే బాగానే ఉంటుంది.