చక్రపాణిరెడ్డితో ఎంఎల్సీ పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించినట్లే మొత్తం ఫిరాయింపు ఎంఎల్ఏలతో చంద్రబాబునాయుడు రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు దిగితే తెలుస్తుంది అప్పుడు ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో? అంటూ ఎద్దేవా చేసారు.
వైసీపీ ఎంఎల్ఏ రోజా మీడియా సమావేశంలో ఫిరాయింపు మంత్రులను ఓ ఆటాడుకున్నారు. శనివారం నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ, మొత్తం పప్పు బ్యాచ్ అంతా క్యాబినెట్ లో చేరిందంటూ ఎద్దేవా చేసారు. ఫిరాయింపులతో పాటు పనిలో పనిగా మంత్రి నారా లోకేష్ పై కూడా సెటైర్లేసారు. చక్రపాణిరెడ్డితో ఎంఎల్సీ పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించినట్లే మొత్తం ఫిరాయింపు ఎంఎల్ఏలతో చంద్రబాబునాయుడు రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు దిగితే తెలుస్తుంది అప్పుడు ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో? అంటూ ఎద్దేవా చేసారు.
అమరావతిలో కూర్చుని తాళింపు వేసుకుంటూ వచ్చే ఎన్నకల్లో టిడిపికి 140 సీట్లు వస్తుందని చెప్పుకోవటం కాదన్నారు. నంద్యాలలో లక్ష మందితో బహిరంగ సభ పెట్టమని సవాలు విసిరారు. మంత్రులు అమరనాధరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామాలు చేయాలని సవాలు విసిరారు. క్యాబినెట్లో టమోటాపప్పు, దోసకాయపప్పు, ముద్దపప్పు అంతా చేరిందన్నారు. వీరంతా పప్పుగారి శిష్యులన్నారు. అదే సందర్భంలో నిప్పు చంద్రబాబునాయుడు, పప్పు లోకేష్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నట్లు మండిపడ్డారు. మొత్తం మీద రోజా తన మాటలతో ఇటు పిరాయింపు మంత్రులనే కాదు అటు తండ్రి, కొడుకులపైన కూడా ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.
