Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై రోజా పంచ్

హోదా వల్ల ఏం ఉపయోగాలున్నాయో నిజంగా చంద్రబాబు తెలుసుకోవాలని ఉంటే టిడిపి నేతలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్ లాంటి వాళ్ళను అడిగితే తెలుస్తుందన్నారు. హోదా వల్ల ఏం ఉపయోగాలుంటాయని వారు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళి పరిశ్రమలు పెట్టారో అడిగితే వాళ్ళే చెబుతారంటూ రోజా ఎద్దేవా చేసారు.

Roja delivers a knock out punch to Naidu on seniority

చంద్రబాబు స్టేట్ మెంట్ పై ఆర్ కె రోజా పంచ్ విసిరారు. ఈరోజు మీడియాలో మాట్లాడుతూ, దేశం మొత్తం మీద సీనియర్ తానే అని చంద్రబాబు చెప్పుకోవటాన్ని తప్పుపట్టారు. సిఎంకు కావాల్సింది సీనియారిటీ కాదని, సిన్సియారిటీ అని ఎద్దేవా చేసారు. అదే సందర్భంలో ‘వినేవాడు వెర్రివాడైతే....చెప్పేవాడు చంద్రబాబు’ అనే సామెత చంద్రబాబును ఉద్దేశించి రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంలో ఉందన్నారు.  

ప్రత్యేకహోదా వల్ల ఉండే ఉపయోగాలుంటో వైసీపీ ఎంఎల్ఏ రోజా ముఖ్యమంత్రికి వివరించారు. హోదా వల్ల ఏం ఉపయోగాలున్నాయో నిజంగా చంద్రబాబు తెలుసుకోవాలని ఉంటే టిడిపి నేతలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్ లాంటి వాళ్ళను అడిగితే తెలుస్తుందన్నారు.

హోదా వల్ల ఏం ఉపయోగాలుంటాయని వారు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళి పరిశ్రమలు పెట్టారో అడిగితే వాళ్ళే చెబుతారంటూ రోజా ఎద్దేవా చేసారు.

హోదా వల్ల ఏమీ ఉపయోగం లేకపోతే, పోయిన ఎన్నికల్లో ప్రత్యేకహోదా 15 ఏళ్ళు కావాలని ఎందుకు డిమాండ్ చేసారో చెప్పాలని నిలదీసారు. శాసనసభ మొదటి సమావేశంలోనే ప్రత్యేకహోదా, ప్యాకేజి రెండూ కావాలంటూ కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేశారంటూ ప్రశ్నించారు.

ఓటుకునోటు కేసులో ఇరుక్కున తర్వాతే ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబుపై స్వరం మార్చారంటూ ధ్వజమెత్తారు. హోదాపై పూర్తిస్ధాయిలో పోరాటాలు చేస్తోంది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు.  

రెవిన్యూలోటును బర్తీ చేయమని చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా అడిగే స్ధితిలో లేరంటే భయపడటం నిజంగా సిగ్గు చేటన్నారు. ముఖ్యమంత్రికి సీనియారిటీ కాదు సిన్సియారిటీ కావాలన్నారు.

సీనియారిటీనే ముఖ్యమంటే చంద్రబాబు కన్నా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళున్నట్లు ఎద్దేవా చేసారు. గజదొంగ సిఎం అయితే ఎంత నష్టం జరుగుతుందో చంద్రబాబు వల్ల ఇపుడు అంతే నష్టం జరుగుతోందన్నారు.

మోడి ప్రధానమంత్రి అవుతారని ఊహించని కారణంగానే గోద్రా అల్లర్ల నేపధ్యంలో మోడిని అరెస్టు చేయిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనను రోజా గుర్తు చేసారు. ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టటం వల్ల రాష్ట్రం, యువత భవిష్యత్తును కాలరాస్తున్నట్లు చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై కలిసి వచ్చే అన్నీ పార్టీలతో పోరాటాలు చేస్తామని రోజా స్పష్టం చేసారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios