ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం వద్ద కారు బోల్తా పడటం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి ఉండవల్లి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పంట పొలాలలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో సీఎం నివాసం మీదుగా వెళ్లే మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.