కృష్ణా జిల్లా నందిగామలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన వున్న లారీ పక్కకు ఒరిగి మెకానిక్ అందులో ఇరుక్కుపోయాడు. లారీ రీపేర్ కావడంతో మెకానిక్‌ను పిలిపించాడు డ్రైవర్.

ఈ సందర్భంగా మెకానిక్‌ లారీని రీపేర్ చేస్తుండగా.. జాకీలపై నిలబెట్టిన లారీ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. కంచికచర్ల పెట్రోల్ బంక్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రాణాపాయ స్థితిలో వున్న లారీ మెకానిక్‌ను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదంతో విజయవాడ- హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది.