సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. పోలీసులు పట్టించుకోవడం లేదంటే ఆరోపించాడు. విషయం ఏంటంటే.. ఆర్ఎంపీడాక్టర్ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ వారు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన అనంతపురంలోని పుట్లూరు మండలం కొండాపూర్ లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.