(వీడియో) విజయవాడకు చేరుకున్న రేవంత్ రచ్చ

First Published 28, Oct 2017, 10:23 AM IST
Rival groups in ttdp reaches Vijayawada to meet Naidu
Highlights
  • అమరావతిలో టిటిడిపి నేతలు మోహరించారు.
  • పార్టీ నుండి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డిని బయటకు పంపటమే ఏకైక లక్ష్యంగా తెలంగాణా టిడిపిలోని పలువురు నేతలు పావులు కదుపుతున్నారు.
  • అందుకోసం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యేందుకు శనివారం ఉదయానికే పలువురు విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

అమరావతిలో టిటిడిపి నేతలు మోహరించారు. పార్టీ నుండి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డిని బయటకు పంపటమే ఏకైక లక్ష్యంగా తెలంగాణా టిడిపిలోని పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. అందుకోసం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యేందుకు శనివారం ఉదయానికే పలువురు విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా ఏపి టిడిపితో పాటు టిటిడిపి నేతల్లో రెవంత్ పెట్టిన చిచ్చు అందరికీ తెలిసిందే.

 

త్వరలో కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్న రేవంత్ టిడిపి నేతలను చెండాడుకున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఏపి టిడిపి నేతలకున్న సంబంధాలను బట్టబయలు చేయటంతో రాజకీయంగా రెండు రాష్ట్రాల్లోనూ కలకలం రేగింది.

దాని పర్యవసానమే టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, టిటిడిఎల్పీ శాసనసభా పక్ష నేతగా రేవంత్ ను చంద్రబాబు ఊడబీకారు. శుక్రవారం విదేశాల నుండి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు రేవంత్ తో పాటు వ్యతిరేక వర్గాలతో కూడా చర్చించారు. తర్వాత ఏ నిర్ణయం తీసుకోకుండా అందరినీ ఈరోజు విజయవాడకు రమ్మని చెప్పారు. దాంతో రేవంత్ పై నిర్ణయం తీసుకునే వేదిక విజయవాడకు మారింది.

అందుకే ఈరోజు ఉదయం నుండి సిఎం క్యాంపు కార్యాలయమంతా టిడిపి నేతలతో సందడిగా మారింది. రేవంత్ తో పాటు ఆయన వ్యతిరేక వర్గమైన టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. వీరితో భేటికి చంద్రబాబు కేటాయించిన సమయం ఉదయం 10.30 నుండి 12 గంటల మధ్య. అయితే, అనుకున్న సమయానికి చంద్రబాబు సమావేశాలు ఎప్పుడూ మొదలుకావన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వీరి భేటీ ఎప్పుడు మొదలవుతుందా అని పలువురు నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

loader