తెలుగుదేశంపార్టీకి రివర్స్ షాక్ తగిలింది.  మూడు రోజుల క్రితమే వైసిపి నుండి టిడిపిలో చేరిన గుడివాడ మున్సిపల్ వైసిపి ఫ్లోర్ లీడర్  రవికాంత్ ఆదివారం తిరిగి వైసిపిలోకి వచ్చేసారు. గుడివాడ మున్సిపాలిటీలో వైసిపి ఫ్లోర్ లీడర్ ను టిడిపి నేతలు ప్రలోభాలకు గురిచేసి ఆకర్షించారు. దాంతో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో రవికాంత్ టీడీపీలో చేరారు. అయితే, మూడు రోజుల్లో ఏమైందో తెలీదు కానీ ఆదివారం రవికాంత్ తిరిగి వైసిపిలోకి వచ్చేసారు. అంతేకాకుండా గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్‌ విలేకరుల సమావేశంలో టిడిపి నేతలపై మండిపడ్డారు.

మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను ఆయన బయట పెట్టారు. త్వరలోనే టీడీపీ నేతలు తనను ఏ విధంగా ప్రలోభాలకు గురిచేసారో ఆధారాలతో సహా బయటపెడతానని ప్రకంటించటం సంచలనంగా మారింది.  ఎంఎల్ఏ మాట్లాడుతూ, చం‍ద్రబాబు వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని హెచ్చరించారు.