విద్యార్థులకు చదవు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ది అడ్డదారి తొక్కింది. రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ఉన్న వ్యక్తి విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడు.

కర్నూలు: విద్యార్థులకు చదవు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ది అడ్డదారి తొక్కింది. రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ఉన్న వ్యక్తి విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడు. కర్నూలులో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలులోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినిని ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేశాడు. గదికి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని తన తండ్రికి ఫిర్యాదు చేసింది. 

ఈ క్రమంలోనే విద్యార్థిని తండ్రి ఆమెను మరో స్కూల్‌లో చేర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెసిడెన్షియల్ స్కూల్‌లో టీసీ తీసుకోవడానికి వెళ్లగా.. టీసీ ఇచ్చేందుకు కూడా ప్రిన్సిపల్ ఇబ్బంది పెట్టాడు. చివరకు ఎలాగోలా టీసీ తీసుకున్నారు. అయితే ప్రిన్సిపల్ వేధింపుల నేపథ్యంలో.. ఈ విషయంపై ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ, మహిళా కమిషన్, కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎవరికి ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థిని తండ్రి వాపోతున్నారు. ఎన్నో చట్టాలు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. మహిళలపై వేధింపులు ఆగడం లేదని అంటున్నాడు. ఇటువంటి కీచక టీచర్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.