విజయవాడలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ప్రమాదానికి గురైన నలుగురు ఇంజనీరింగ్ విద్యాార్ధులు మృత్యువాతపడ్డారు. ఇంకా రాజ్ కుమార్ మృతదేహం ఇంకా దొరకలేదు. ఆదివారం నాడు దొరికిన మృతదేహాం రాజ్‌కుమార్‌ది కాదని అధికారులు స్పష్టం చేశారు.దీంతో రాజ్ కుమార్ మృతదేహాం కోసం గాలింపు చర్యలను ప్రారంభించారు.
.ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ప్రమాదానికి గురై నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతైన విషయం తెలిసిందే. .దీంతో అధికారులు శనివారం నాడు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. శనివారం నాడు రాత్రే చైతన్య రెడ్డి, ప్రవీణ్, శ్రీనాథ్‌ల మృతదేహాలను వెలికితీశారు.అయితే రాజ్‌కుమార్ మృతదేహాం శనివారం నాడు లభ్యం కాలేదు.
ఆదివారం ఉదయం పూట రెస్క్యూ టీమ్ మృతదేహన్ని వెలికితీశారు. అయితే ఈ మృతదేహం రాజ్ కుమార్ ది కాదని కుటుంబసభ్యలు తేల్చారు. దీంతో మరోసారి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. .
గత సంవత్సరం నవంబర్ లో ఇదే ప్రాంతంలో బోటు బోల్తా పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కృష్ణా, గోదావరి నదుల నీరు కలిసే పవిత్ర సంగమం వద్ద ఇలా నలుగురు విద్యార్థులు మృతి చెందారు.
