Asianet News TeluguAsianet News Telugu

ఆచూకీ లేదు, ఆనందయ్యను వదిలేయండి: కృష్ణపట్నం గ్రామస్తులు

ఆనందయ్య ఎక్కడున్నా విడిచి పెట్టాలని కృష్ణపట్నం గ్రామప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఆనందయ్య ఆచూకీ లేదని.. ఆయన ఎక్కడ వున్నారో తెలియడం లేదని గ్రామస్తులు అంటున్నారు. కృష్ణపట్నం పోర్ట్‌లో ఆనందయ్య వున్నాడని.. ఆయనే తనను వదిలిపెట్టాలని కోరుతున్నారనే సమాచారంతో గ్రామస్తులు ఈ డిమాండ్ చేస్తున్నారు. 

Release Anandaiah from illegal detention sasy krishnapatnam villagers ksp
Author
Krishnapatnam, First Published May 28, 2021, 2:31 PM IST

ఆనందయ్య ఎక్కడున్నా విడిచి పెట్టాలని కృష్ణపట్నం గ్రామప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఆనందయ్య ఆచూకీ లేదని.. ఆయన ఎక్కడ వున్నారో తెలియడం లేదని గ్రామస్తులు అంటున్నారు. కృష్ణపట్నం పోర్ట్‌లో ఆనందయ్య వున్నాడని.. ఆయనే తనను వదిలిపెట్టాలని కోరుతున్నారనే సమాచారంతో గ్రామస్తులు ఈ డిమాండ్ చేస్తున్నారు. 

కాగా.. మందు తయారీ, పంపిణీపై జోక్యం చేసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య  గురువారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సోమవారం నాడు  విచారణ నిర్వహించనుంది హైకోర్టు.దాదాపు ఐదు రోజులుగా  ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది.  మందుకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.  ఆనందయ్య మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన రెండు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. మరోవైపు ఆనందయ్య కూడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 

Also Read:ఈ నెల 29న ఆనందయ్య మందుపై ల్యాబ్ నుండి రిపోర్ట్స్: హైకోర్టులో ఏపీ సర్కార్

30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్ గా ఉన్నట్టుగా ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. కరోనాపై సంప్రదాయ ఆయుర్వేద వైద్యం చేస్తున్నట్టుగా చెప్పారు. మందు తయారీ, పంపిణీలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఆయుష్ కమిషనర్ ను చేర్చారు.  ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేపట్టనుంది హైకోర్టు.ఆనందయ్య మందు ఉపయోగించిన రోగుల నుండి సేకరించిన సమాచారాన్ని సీసీఆర్ఏఎస్ కు ఆయుర్వేద  వైద్యులు పంపారు. ఢిల్లీలోని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios