అమరావతి: ఆనందయ్య తయారు చేసిన మందుపై  ఈ నెల 29వ తేదీన ల్యాబ్ నుండి రిపోర్టు వస్తోందని ఏపీ ప్రభుత్వం  హైకోర్టుకు తెలిపింది.ఆనందయ్య మందును సరఫరా చేయాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఆనందయ్య మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని  ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య తయారు చేసిన మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం  హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.  

also read:ఆనందయ్య మందు: సీసీఆర్ఏఎస్‌కి చేరిన డేటా, చేప మందు తరహలో అవకాశమిస్తారా?

ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఈ మందు కోసం  ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు అడిగింది. అయితే ఈ నెల 29వ తేదీన ల్యాబ్ నుండి రిపోర్టులు వస్తాయని ప్రభుత్వం హైకోర్టుకు సమాచారం ఇచ్చింది. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా  ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ తరపు  న్యాయవాది కృష్ణయ్య ప్రశ్నించారు. ఆనందయ్య తో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారన్న పిటిషనర్ న్యాయవాది బాలాజీ ప్రశ్నించారు. ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి, ఆ మందుపై అభిప్రాయం ఏంటో కోర్టుకు కేంద్రాన్ని  హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్లపై విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.