ఎంత బరితెగింపు... వినాయకుడి ముందే అమ్మాయిల రికార్డింగ్ డాన్సులు (వీడియో)
భక్తిశ్రద్దలతో పూజించాల్సిన వినాయకుడి ముందు అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు చేయించిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది.

ప్రకాశం : వినాయక చవితి... వాడవాడలా బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్టించి భక్తిశ్రద్దలతో పూజలు చేసే పవిత్రమైన పండగ. కానీ కొందరు కేవలం తమ ఎంజాయ్ మెంట్ కోసమే ఈ పండగను జరుపుకుంటున్నారు. ఇలా ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో వినాయకుడి ముందే అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వీడియో బయటకు రావడంతో నిర్వహకులపై హిందూ సంఘాలు, ప్రజలు భగ్గుమంటున్నారు.
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. అయితే విఘ్న నాయకుడిని భక్తిశ్రద్దలతో కొలవాల్సింది పోయి బూతు పాటలతో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటుచేసారు. మండపం ముందే అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ వినాయక చవితి పవిత్రతను మంటగలిపేలా వ్యవహరించారు. ఈ రికార్డింగ్ డ్యాన్సులు వైసిపి నాయకులు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.
వీడియో
వినాయక చవితి సందర్భంగా జంగంగుంట్లలో ఏర్పాటుచేసిన ఈ రికార్డింగ్ డ్యాన్సులు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. వేదికపై అమ్మాయిలు సినిమా పాటలకు చిందేస్తుంటే యువత కేరింతలతో హోరెత్తించారు. ఇలా 'జై బోలో గణేష్ మహరాజ్ కీ జై' అనే శబ్దాలు వినిపించాల్సిన చోట 'ఊ అంటావా మామా... ఉఉ అంటావా' అంటూ సాగే హైటమ్ సాంగ్స్ వినబడ్డాయి.
పవిత్రమైన వినాయక మండపం వద్ద రికార్డింగ్ డ్యాన్సులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నిర్వహకులపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.