వాజ్‌పేయ్‌: ఎన్టీఆర్‌, బాబుతో అనుబంధం, ఏపీపై అభిమానం

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 17, Aug 2018, 2:07 PM IST
realtions between former prime minister vajpapayee and TDP leaders
Highlights

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం అంటే మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్‌కు  చాలా ఇష్టం. ప్రధానమంత్రిగా ఉన్నా, విపక్ష నేతగా ఉన్న ఏపీ రాష్ట్రంతోనూ, టీడీపీతోనూ  వాజ్‌పేయ్ సంబంధాలను కొనసాగించారు. ఎన్టీఆర్ తో టీడీపీతో ప్రారంభమైన సంబంధాలు  ఆ తర్వాత చంద్రబాబునాయుడుతో  సంబంధాలు కొనసాగాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం అంటే మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్‌కు  చాలా ఇష్టం. ప్రధానమంత్రిగా ఉన్నా, విపక్ష నేతగా ఉన్న ఏపీ రాష్ట్రంతోనూ, టీడీపీతోనూ  వాజ్‌పేయ్ సంబంధాలను కొనసాగించారు. ఎన్టీఆర్ తో టీడీపీతో ప్రారంభమైన సంబంధాలు  ఆ తర్వాత చంద్రబాబునాయుడుతో  సంబంధాలు కొనసాగాయి. 

ఆంధ్రప్రదేశ్  అంటే  వాజ్‌పేయ్‌కు  చాలా అభిమానంగా ఉండేవారు. 1984లో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించి నాదెండ్ల భాస్కర్ రావు  సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. ఆ సమయంలో టీడీపీ,  వామపక్షాలు, బీజేపీలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో  పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌కు ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ ఆనాడు రాష్ట్రపతి భవన్ ‌వద్ద పేరేడ్ నిర్వహించారు.  ఆ సమయంలో  ఆనాడు వాజ్‌పేయ్  టీడీపీకి బాసటగా నిలిచారు.  ఆ సమయంలో ఎల్బీ స్టేడియంలో టీడీపీ నిర్వహించిన సభలో వాజ్‌పేయ్ పాల్గొన్నారు. 

ఆ తర్వాత ఎన్టీఆర్ తో  వాజ్‌పేయ్ సంబంధాలు కొనసాగాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణం చేసిన కార్యక్రమంలో కూడ వాజ్‌పేయ్ పాల్గొన్నారు.  జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలకంగా వ్యవహరించిన సమయంలో వాజ్‌పేయ్ తో ఎన్టీఆర్ కు మంచి సంబంధాలు ఉండేవి.

ఎన్టీఆర్ మరణం తర్వాత  1998లో హైటెక్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాజ్‌పేయ్ ప్రధానమంత్రి హోదాలో పాల్గొన్నారు. 1999లో  వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా మూడో దఫా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  ఎన్డీఏకు చంద్రబాబునాయుడు కన్వీనర్ గా ఉండేవాడు.

ఆ సమయంలో రాష్ట్రపతిగా  అబ్దుల్ కలాంను ఎంపిక చేయడంలో  చంద్రబాబునాయుడు కీలకంగా వ్యవహరించారు. తొలుత  అబ్దుల్ కలాం కాకుండా ఎన్డీఏ అభ్యర్ధి కాకుండా మరో వ్యక్తిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని వాజ్‌పేయ్ ఫోన్ ద్వారా చంద్రబాబునాయుడుకు చేరవేశారు. అయితే ఈ విషయమై బాబు వాజ్‌పేయ్ ప్రతిపాదనను విబేధించారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా  వాజ్‌పేయ్ ప్రతిపాదించిన పేరును బాబు వ్యతిరేకించారు. ఈ విషయమై ఆయన ఢిల్లీకి వెళ్లారు. కలాం పేరును ప్రతిపాదించారు. ఈ విషయమై  కలాంను కూడ ఒప్పించారు.అయితే బాబు చేసిన సూచనను ఆ తర్వాత వాజ్‌పేయ్ కూడ అంగీకరించారు. 

ఎంఎంటీఎస్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో  మంజూరయ్యాయి. అయితే వీటి  మంజూరు కోసం తాను ఆ సమయంలో ప్రధానమంత్రి వాజ్‌పేయ్‌పై ఒత్తిడి తెచ్చానని.. తన ఒత్తిడిని భరించలేక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను వాజ్‌పేయ్ మంజూరు చేశారని చంద్రబాబునాయుడు చెబుతుంటారు.

1999లో ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబునాయుడు కొనసాగారు. ఆ సమయంలో వాజ్‌పేయ్‌కు బాబు ఏది చెబితే దాన్ని వాజ్‌పేయ్ పాటించేవారనే ఆ కాలంలో ప్రచారంలో ఉండేది. స్వంత రాష్ట్రాల సీఎంల కంటే బాబుకు వాజ్‌పేయ్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పేవారు. ఐఆర్‌డీఏ కార్యాలయం ముంబైలో కాకుండా హైద్రాబాద్‌లో ఏర్పాటు చేయడంలో బాబు కీలకంగా వ్యవహరించారని టీడీపీ నేతలు అప్పట్లో చెప్పేవారు.

బాబు చేసిన సూచన మేరకు ఐఆర్‌డీఏ కార్యాలయాన్ని ముంబైలో కాకుండా హైద్రాబాద్‌లో ఏర్పాటుకు వాజ్‌పేయ్ అంగీకరించారు. దీంతో ఐఆర్‌డీఏ కార్యాలయంలో హైద్రాబాద్‌లో ఏర్పాటు చేశారు.

ఈ వార్తలు చదవండి

వాజ్‌పేయ్ లవ్‌స్టోరీ: ఆ లవ్‌లెటర్ అందితే...

నాతో వాజ్‌పేయ్ వివాదమిదీ: గోవిందాచార్య

ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్‌పేయ్ సర్కార్
 

loader