Asianet News TeluguAsianet News Telugu

రాయపాటి మోహన సాయి కృష్ణ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు కుటుంబం చక్రం తిప్పుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రస్తుతం టీడీపీలో కూడ రాయపాటి కుటుంబం హావా సాగిస్తోంది

rayapati mohanasai krishna sensational comments on tdp
Author
Guntur, First Published May 10, 2019, 12:52 PM IST

గుంటూరు: గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు కుటుంబం చక్రం తిప్పుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రస్తుతం టీడీపీలో కూడ రాయపాటి కుటుంబం హావా సాగిస్తోంది. అయితే తాజాగా రాయపాటి సాంబశివరావు సోదరుడు శ్రీనివాస్  తనయుడు మోహనసాయికృష చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

గుంటూరు జిల్లా   రాయపాటి సాంబశివరావు రెండో సారి నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు నర్సరావుపేట నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా కూడ ఇదే స్థానం నుండి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు.

నర్సరావుపేట ఎంపీ స్థానం కేటాయించే విషయమై టీడీపీ నాయకత్వం వ్యవహరించిన తీరుపై  ఒకానొక దశలో రాయపాటి  కొంత అసహనాన్ని కూడ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 23వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే  అవకాశం ఉంది. ఈ తరుణంలో రాయపాటి సాంబశివరావు సోదరుడు శ్రీనివాస్ తనయుడు మోహనసాయికృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోవడానికి టీడీపీతో పాటు అన్ని పార్టీలు కూడ కారణమని వ్యాఖ్యానించారు. తనకు ఏ పార్టీతో సంబంధాలు లేవని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో  వైసీపీపై మోహనసాయికృష్ణ  కొంత డోస్ తగ్గించి మాట్లాడారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

రాయపాటి కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంది. రాయపాటి సోదరుడు శ్రీనివాస్ ఎన్నికలకు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం  ఆశించారు. కానీ, టీడీపీ నాయకత్వం రాయపాటి శ్రీనివాస్ టిక్కెట్టు ఇవ్వలేదు. 

రాయపాటి మోహనసాయి కృష్ణ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ప్రస్తుతం అందరిలో చర్చ సాగుతోంది. రాయపాటి శ్రీనివాస్ తనయుడు మోహనసాయి కృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆ కుటుంబం టీడీపీని వీడుతోందా అనే చర్చ కూడ ప్రారంభమైంది. అయితే ఈ విషయంలో రాయపాటి శ్రీనివాస్ స్పందించలేదు.సాయికృష్ణ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ విషయమై రాయపాటి సాంబశివరావు ఎలా స్పందిస్తారో చూడాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios