Asianet News TeluguAsianet News Telugu

రాయపాటి భలే కలరింగ్ ఇస్తున్నారు

రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబే ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాన్ని తుంగలో తొక్కిన తర్వాత రైల్వే బోర్డు ఏం చేస్తుంది మధ్యలో? ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపధ్యంలో చంద్రబాబుపై జనాల వ్యతిరేకతను రాయపాటి కేంద్రంపైకి మళ్ళిస్తున్నట్లు లేదూ చూస్తుంటే?

Rayapati is upset centre ignoring Naidus demand for vizag railway zone

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబునాయుడు ఫైల్ అయ్యారని జనాలంతా అనుకుంటూంటే ఎంపి రాయపాటి మాత్రం భలే కలరింగ్ ఇస్తున్నారు. రైల్వేజోన్ రాకపోవటంలో చంద్రబాబు తప్పేమీ లేదట. బాధ్యత అంతా పూర్తిగా రైల్వేబోర్డు ఉన్నతాధికారులదేనట. ఈరోజు ధక్షిణమధ్య రైల్వే జిఎం ఆధ్వర్యంలో విజయవాడలో ఓ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు తదితరాలపై  జిఎం ఆధ్వర్యంలో సమావేశానికి ఎంపిలందరూ హాజరయ్యారు. అయితే సమావేశం నుండి టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు మధ్యలోనే బయటకు వచ్చేసారు.

అక్కడే మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు మాట కేంద్రం వద్ద చెల్లుబాటు కావటం లేదన్నట్లుగా చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వే జోన్ కావాలని చంద్రబాబు పదిసార్లు ప్రధానమంత్రిని కలిసినా పనికాలేదట. అంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు డిమాండ్లను కేంద్రం ఏమాత్రం పట్టుంకోవటం లేదని జనాలు అనుకుంటున్నది నిజమేనా?  

పైగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధాని చెప్పినా బోర్డు అధికారులు లెక్క చేయటంలేదన్నారు. మరీ చోధ్యం కాకపోతే,  ప్రధాని మాటను రైల్వే అధికారులు లెక్క చేయకుండా ఉంటారా? పైగా అధికారులు ప్రధానికన్నా పవర్ ఫుల్లట.  తాము చెప్పిన చిన్న చిన్న పనులు కూడా రైల్వే అధికారులు చేయటం లేదట. ఇలా అయితే తమను ప్రజలు చెప్పుతో కొడతారని అనటం విశేషం. గుంటూరు-తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్ల నుండి సాగుతూనే ఉన్నాయన్నారు.

గుంటూరు-చెన్నై డే ట్రయిన్ అడిగినా రైల్వే అధికారుల నుండి స్పందన లేదన్నారు. రాష్ట్రానికి ముందంటూ రైల్వేజోన్ ప్రకటిస్తే తర్వాత దానిని విశాఖపట్నంకు తరలించవచ్చని భలే ఐడియా చెప్పారు కదా రాయపాటి? మరికొద్ది రోజులైతే రైల్వేజోన్ అంశాన్ని మరచిపోవాల్సిందేనని కూడా రాయపాటి చెప్పటం గమనార్హం.

రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబే ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాన్ని తుంగలో తొక్కిన తర్వాత రైల్వే బోర్డు ఏం చేస్తుంది మధ్యలో? ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపధ్యంలో చంద్రబాబుపై జనాల వ్యతిరేకతను రాయపాటి కేంద్రంపైకి మళ్ళిస్తున్నట్లు లేదూ చూస్తుంటే?

Follow Us:
Download App:
  • android
  • ios