ఏపీలో ఖాళీగా వున్న రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి గవర్నర్ ఆమోదం లభించింది. ప్రభుత్వం పంపిన రెండు పేర్లను గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఆమోదించారు.

అమరావతి: ఏపీలో ఖాళీగా వున్న రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి గవర్నర్ ఆమోదం లభించింది. ప్రభుత్వం పంపిన రెండు పేర్లను గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. దీంతో మైనారిటీ నాయకురాలు జకీయా ఖానుమ్ తో పాటు పండుల రవీంద్రబాబులను ఎమ్మెల్సీ లుగా గవర్నర్ కోటాలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు రాష్ట్రంలో ఖాళీగా వుండటంతో ఒక పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి మరో పదవిని మైనార్టీలకు ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో 2019 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మైనార్టీ వర్గం నుండి జకియా ఖానుం పేర్లను వైసీపీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. 

read more కరోనా వస్తుంది, పోతుంది...ఇక కలిసి జీవించాల్సిందే..: మరోసారి సీఎం సంచలన వ్యాఖ్యలు

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ సమీకరణల కారణంగారవీంద్రబాబుకు ఎంపీ టిక్కెట్టు లభించలేదు. ఆ సమయంలోనే రాజ్యసభకు పంపుతామని వైసీపీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే రాజ్యసభ టిక్కెట్టు ఆయనకు దక్కలేదు. దీంతో తాజాగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. 

ఇర పార్టీ కోసం పనిచేసిన జకియా ఖానుం భర్త మరణించాడు. దీంతో ఆ కుటుంబానికి న్యాయం చేసే ఉద్దేశ్యంతో ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకొన్నారు. గవర్నర్ కోటాలో వీరిద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపగా ఆయన ఆమోదం లభించింది. దీంతో వారిద్దరు అధికారికంగా ఎమ్మెల్సీలుగా మారారు.