Asianet News TeluguAsianet News Telugu

వలలో చిక్కిన వింత చేప.. ఒళ్లంతా నలుపు, తెలుపు మచ్చలు… నోరు కూడా వెరైటీగా (వీడియో)

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో వింత చేప ప్రత్యక్షమైంది. ఆ చేప ఒంటిపై నలుపు, తెలుపు మిళితమైన మచ్చలు కనిపిస్తున్నాయి. అంతే కాదు చేప నోరు కూడా కింది భాగంలో ఉండి చూసేందుకు విచిత్రంగా వుంది.
 

rare fish caught by fisherman in ntr district
Author
First Published Sep 24, 2022, 9:43 PM IST

ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో వింత చేపలు కనిపిస్తూ వార్తల్లోకెక్కుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ఇతర ప్రాంతాలు నుంచి ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి కొట్టుకొస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలుగు నాట కూడా వానలు దంచి కొడుతున్నాయి. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షంతో పాటు చేపలు కూడా పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు వింత చేపలు సైతం మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయి . 

తాజాగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో వింత చేప ప్రత్యక్షమైంది. స్థానిక జాలరి ఒకరు చెరువు పక్కనే ఉన్న చిన్న కాలువలో వేటకు వెళ్లగా అతని వలకు వింత చేప చిక్కింది.  ఆ చేప ఒంటిపై నలుపు, తెలుపు మిళితమైన మచ్చలు కనిపిస్తున్నాయి. అంతే కాదు చేప నోరు కూడా కింది భాగంలో ఉండి చూసేందుకు విచిత్రంగా వుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వింత చేపను చూసేందుకు పోటెత్తుతున్నారు. ఇదివరకెప్పుడూ ఇలాంటి చేపను చూడలేదంటున్నారు స్థానికులు.

 

Follow Us:
Download App:
  • android
  • ios