దళిత మైనర్ బాలికపై అత్యాచారయత్నం... అన్నలా అండగా వుంటానన్న లోకేష్

విశాఖలో పాస్టర్ చేత వేధింపులకు గురయిన బాలిక చదువు బాధ్యత తీసుకుంటానంటూ ఆ కుటుంబానికి భరోసా కల్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. 

rape attempt on minor girl... nara lokesh reacts

విశాఖపట్నం: దళిత మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారానికి పాల్పడిన దారుణం విశాఖపట్నంలో చోటుచేసుంది.  వాంబే కాలనీకి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఫాస్టర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తాజాగా బయటపడటంతో బాధిత బాలికకు న్యాయం చేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

ఈ దారుణ ఘటనపై తాజాగా స్పందించిన మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాధిత కుటుంబ సభ్యులతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తల్లి చనిపోవడంతో మేనత్త సంరక్షణ లో వుంటోంది. దీంతో బాధిత బాలిక తండ్రితో పాటు మేనత్త తో ఫోన్లో మాట్లాడారు నారా లోకేష్. 

ఈ క్రమంలోనే బాలికకు అన్నలా అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. బాలిక చదువు బాధ్యత తీసుకుంటానంటూ ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ఇలా భాదితురాలికి, ఆ కుటుంబానికి  అండగా వుంటానన్నారు. అంతేకాకుండా ఈ అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి  శిక్షపడేలా ఆ కుటుంబం చేస్తున్న పోరాటానికి కూడా టిడిపి అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. 

read more  టిక్ టాక్ లో ప్రేమ.. మోసం చేసిన ప్రేమికుడు.. ఆమెకిది రెండోసారి..

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాజువాకలో అత్యాచార ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్నాటు చేసినట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు వెల్లడించారు. ఈ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులుగా వంగలపూడి అనిత, పుచ్చా విజయకుమార్, ఇతలపాక సుజాత, బడుమురి గోవిందులను నియమించినట్లు వెల్లడించారు.     

అత్యాచార సంఘటనలో నిందితులను రక్షించేందుకు వైకాపా నేతలు ప్రయత్నించడం దుర్మార్గమని కళా మండిపడ్డారు. అత్యాచార సంఘటనలపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలియజేస్తుంటే వైసిపి నేతలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అరాచక పాలనకు ఆంధ్రప్రదేశ్ ను అడ్డాగా మర్చారని వెంకట్రావు మండిపడ్డారు. 

''దిశా చట్టం క్రింద ఎంతమందిని శిక్షించారు. దళితులపై దాడులు, మహిళలపై అకృత్యాలు గణనీయంగా పెరుగుతున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మహిళలపై దాడులు దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్నాయి. 29.3 శాతం పైగా నేరాలు ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయి'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు కళా వెంకట్రావు. 
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios