మైనర్ బాలికపై న్యూఇయర్ ఆరంభంరోజునే ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణం నందిగామలో చోటుచేసుకోగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

నందిగామ: ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ మహిళలకు రక్షణ మాత్రం దక్కడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల మానప్రాణాలు కాపాడేందుకు ఎన్ని కఠిన చట్టాలు చేసినా, పోలీసులు మరెంత కఠినంగా వున్నా వేధింపులు, అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. తెలుగురాష్ట్రాలు కూడా దిశ చట్టం, షీ టీమ్స్ వంటి మహిళా రక్షణ చర్యలు తీసుకున్నా వారిపై వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. ఇలా నూతన సంవత్సరాది (new year) రోజే ఓ బాలికపై కామాంధుడు అఘాయిత్యానికి యత్నించిన సంఘటన కృష్ణా జిల్లా (krishna district)లో చోటుచేసుకుంది. కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కృష్ణా జిల్లా నందిగామ (nandigama) పట్టణ శివారులోని డివిఆర్ కాలనీలో ఓ మైనర్ బాలిక (minor girl) కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఆ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కన్నేసాడు. ఎలాగయినా ఆమెను అనుభవించాలన్న నీచపు బుద్దితో అదునుకోసం చూస్తున్న అతడికి నూతన సంవత్సరాది (జనవరి 1వ తేదీన) రోజున బాలిక ఒంటరిగా కనిపించింది. 

అర్థరాత్రి సమయంలో బాలిక కనిపించడంతో ఇదే అదునుగా భావించిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికను బలవంతం చేస్తూ చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి బారినుండి ఎలాగోలా తప్పించుకున్న బాలిక మరుసటి రోజు జరిగిందంతా తల్లిదండ్రులకు తెలిపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

read more ఒంటరిగా ఉన్న పదమూడేళ్ల బాలికపై అత్యాచారం..

తమ కూతురిపై జరిగిన అత్యాచారయత్నం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఫోక్సో చట్టం (POCSO Act) కింద సదరు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో వున్న యువకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే నూతన సంవత్సర వేడకలు జరుపుకుని రాత్రి సమయంలో ఇంటికి వెళుతున్న ఇద్దరు గిరిజన బాలికలపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసునంటూ బెదిరించి ఇద్దరు యువతులపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన విజయనగరం జిల్లా (vijayanagaram district)లో చోటుచేసుకుంది.

విజయనగరం జిల్లా కురపాం (kurapam) నియోజకవర్గ పరిధిలోని జియ్యమ్మవలస (jiyammavalasa) మండలానికి చెందిన ఇద్దరు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని ఇంటికి తిరిగివెళుతుండగా రావాడ డ్యాం (ravada dam) వద్ద ఒకడు అడ్డుకున్నాడు. యువతుల వాహనాన్ని అడ్డుకున్న అతడు పోలీసునంటూ బెదిరించాడు. అతడి బెదిరింపులకు యువతులిద్దరూ బెంబేలెత్తిపోయారు. 

read more కుమార్తెపై అత్యాచారం.. గర్భందాల్చడంతో అబార్షన్.. తండ్రికి 20 యేళ్ల జైలు శిక్ష...

తాను చెప్పినట్లు వినకుంటే అరెస్ట్ చేస్తానని బెదిరించిన దుండగుడు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత వారిని విడిచిపెట్టాడు.

 అయితే ఇంటికి చేరుకున్న యువతులు తమపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల నుండి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. యువతులను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నకిలీ పోలీస్ రాంబాబును అదుపులోకి తీసుకున్నారు.