జగన్ స్పీడ్: ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌గా రామసుందర రెడ్డి నియామకం..?
ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమీషనర్‌గా రామసుందర రెడ్డిని వైఎస్ జగన్ ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈయన నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం రామసుందరరెడ్డి తుడా సెక్రటరీగా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమీషనర్‌గా రామసుందర రెడ్డిని వైఎస్ జగన్ ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈయన నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం రామసుందరరెడ్డి తుడా సెక్రటరీగా పనిచేస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అదే విధంగా ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది.
Aslo Read:రమేష్ కుమార్ ఉద్వాసనలో మెలిక ఇదీ: జగన్ మీద చంద్రబాబు ఫైర్
గవర్నర్ సంతకం చేసిన ఆర్డినెన్స్ ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ రెండు జీవోలను కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రమేష్ కుమార్ కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థలను వాయిదా వేశారని జగన్ స్వయంగా రమేష్ కుమార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Aslo Read:మడమ తిప్పని వైఎస్ జగన్: ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కు ఉద్వాసన
తనకు రక్షణ కల్పించాలంటూ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కూడా వైఎస్ జగన్ కు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా ఆయన తన కార్యాలయాన్ని హైదరాబాదులో కేటాయించిన భవనానికి మార్చుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసపై రమేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.