ప్రచారం, ఎన్నికల వ్యవహారాల్లో తలమునకలైన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్.. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలు, సినిమాలతో సేద తీరారు. కాగా, కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో తిరిగి ఆయన రాజకీయ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు.

గురువారం తన నియోజకర్గానికి వచ్చిన జగన్ నేతలు, కార్యకర్తలతో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు.. జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా రమణ దీక్షితులు.. ఆయనకు ఆశీస్సులు అందించారు. కొద్దిరోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో వీరి కలయిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా మూడు రోజులు పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు.