కుటుంబ కలహలతో  భార్య, కూతురిపై  కత్తితో దాడికి దిగాడు  రామారావు  అనే వ్యక్తి.  రామారావు  కోసం పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.  

శ్రీకాకుళం: జిల్లాలోని ఆమదాలవలస మండలం చొట్టవానిపేటలో శుుక్దారవారం నాడు దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ కసాయి కట్టుకున్న భార్యను, కన్న కుమార్తెను కత్తితో నరికాడు. ఈ ఘటనలో కూతురు విజయ అక్కడికక్కడే మృతి చెందింది.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని చొట్టవాని పేటలో కసాయి భర్త కొల్లి రామారావు తన భార్య కొల్లి సూర్యం పై అనుమానం‌తో వేధించాడు. ఈనేపథ్యంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన కొల్లి రామారావు తన భార్య సూర్యం(55)ను, అడ్డుకున్న కుమార్తె విజయను( 30) కత్తితో విచక్షణా రహితంగా నరికి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో భార్య కుప్పకూలిపోగా కుమార్తె ఘటనా స్థలిలోనే మృతి చెందింది.

కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్న సూర్యంను బంధువులు శ్రీకాకుళం లోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. సూర్యం పరిస్థితి విషమంగా ఉందని సమాచారం..బంధువుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆమదాలవలస పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా నిందితుడు కొల్లి రామారావు పరారయ్యాడు.