రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య మృతి
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతికి జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీశ్ సహా పలువురు అధికారులు సంతాపం తెలిపారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దీనికి ప్రధాన కారణం స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడే రిమాండ్‌లో వున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చ జరిగింది. దీనిపై రకరకాల వాదనలు వస్తుండగా ఇప్పటికే హోంమంత్రి తానేటి వనిత, ఏపీ జైళ్ల శాఖ క్లారిటీ ఇచ్చింది.
ఇదిలావుండగా రాహుల్ భార్య కిరణ్మయి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీశ్ సహా పలువురు అధికారులు సంతాపం తెలిపారు. రాహుల్ భార్య చనిపోయిన విషయంపై మీడియా వక్రీకరించి వార్తలను ప్రచురించవద్దని జిల్లా ఎస్పీ , కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ పేర్కొన్నారు. రాజమండ్రిలోని నవీన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిరణ్మయి మరణించినట్లు డీఐజీ చెప్పారు. భార్య ఆరోగ్యం బాలేదని రెండు రోజుల క్రితం రాహుల్ సెలవుపై వెళ్లినట్లు డీఐజీ స్పష్టం చేశారు.