రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం సృష్టించింది. కిడ్నాప్ కేసులో జైలుకు వచ్చిన విజయవాడ ఖైదీకి కరోనా పాజిటివ్ వచ్చింది.

విజయవాడ నుండి రాజమండ్రికి జైలుకు వాహనంలో ఖైదీని తరలించారు. అయితే ఖైదీని తరలించిన ఎస్కార్ట్ సిబ్బందిలో ప్రస్తుతం కరోనా భయం నెలకొంది.
ఖైదీకి కరోనా సోకిందని తెలిసిన అధికారులు  ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన రోగిని కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.

also read:ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు: ఒక్క రోజులో 425, ఇద్దరు మృతి

ఖైదీని తరలించిన ఎస్కార్ సిబ్బందితో పాటు ఈ ఖైదీని కలిసిన జైలు అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో జైలు అధికారులను పరీక్షించి  క్వారంటైన్ కి తరలించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గురువారం నాటికి 7496కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 425కి నమోదయ్యాయి.రాష్ట్రంలో కరోనా సోకి 2983 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2779 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.విదేశాల నుండి వచ్చినవారిలో 289 మందికి కరోనా సోకింది.