న్యూఢిల్లీ: విగ్రహాలు విరిగిపోతే ఏమిటని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు తీవ్రంగా మండిపడ్డారు. కొడాలి నానికి హెచ్చరికలు చేశారు. కొడాలి నాని వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరో అందరికీ తెలుసునని, దానిపై బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ అదృశ్య శక్తికి చేతులెత్తి మొక్తుతున్నానని ఆయన అన్నారు. "కొడాలి నానికి, ఆయన వెనక ఉన్న అదృశ్య శక్తికి చెబుతున్నా... రాబోయే రోజుల్లో చెయ్యి విరిగొడితే చేయి.. కాలు విరగ్గొడితే కాలు విరగ్గొడుతారు, ఖబడ్దార్" అని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. "అయ్యా.... కొడాలి వెంకటేశ్వర రావు... ఏం నష్టమని అంటున్నారు. దేవుడికి నష్టం కాదు. మాకు నష్టం. మనసులను గాయపరుస్తున్నారు" అని ఆయన అన్నారు. 

"తగులబెట్టింది రథాలను కాదు... భక్తుల మనోరథాలను, విరగొట్టింది విగ్రహాలను కాదు... భక్తుల మనోభావాలను గాయపరిచారు. మతోన్మాదంతో చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుంది. నన్ను బహిష్కరించినట్లు చెప్పుకునే శక్తి లేనది... నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారు. దేవాలయాలపై పార్లమెంటులో మాట్లాడుతుంటే మీ సాటి కులస్థుడితో అల్లరి చేయిస్తారా?" అని ఆయన అన్నారు. 

కులాన్ని కులంతో, మతాన్ని మతంతో.. అదే మతంలో అతి పవిత్రంగా తిరుమల ఆచారాలను పాటించే కేబినెట్ సహచరుడితో ఇలా తనపై విమర్శలు చేయించడం హేయమైన చర్య అని రఘురామ కృష్ణమ రాజు అన్నారు. "మీరు ప్రవేశపెట్టిన పథకాలు... మీకు రివర్స్ వచ్చే పథకాలు చాలక... ఎక్కడా అప్పు పుట్టక స్వామి డబ్బుపై దృష్టి పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. టీటీడీలో ఇద్దరు అధికారులను మార్చాలిసన అవసరం ఏమిటన్న అనుమానాలు తలెత్తతుతున్నాయి" అని ఆయన అన్నారు. 

హిందువైన కొడాలి నాని గానీ, క్రై,స్తవుడైన జగన్ గానీ మక్కాలా అడుగు పెట్టలేరని, అది ముస్లింలకు పవిత్ర స్థలమని ఆయన అన్నారు. నాని అలా మాట్లాడడం విచారకరమని అంటూ మీరు మాట్లాడిేత మిలియన్ వ్యూస్ వస్తాయని జగన్ ను ఉద్దేశించి అన్నారు. దేవలయాలపై దాడులు జరిగితే ఎవరికి నష్టమని అంటున్నారని అంటూ "మీ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం లేదు కదా. నష్టం మాకు. రథం చేయించుకుంటే ఎవరికి లాభం... మీకు ఉండొచ్చు. వెండి పోతే కొనుక్కుంటారని చెబుతున్నారు. పోయింది వెండి కాదండి.. అది అమ్మవారి వెండి" అని ఆయన అన్నారు.

"మీరు విగ్రహాన్ని రాయిగా చూస్తున్నారు. మా దృష్టిలో దేవుడు. పోయిన సొమ్ము అమ్మవారికి చెందింది.  మీరు హిందువు అయి ఉండి... ఓ క్రిస్టియన్ సీఎం చేతిలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే హిందూ మతం కావాలి. ఇంట్లో హిందూ దేవుడి ఫొటో ఉండదు" అని రఘురామ కృష్ణమరాజు అన్నారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరెవరు చర్చిలకు వెళ్తున్నారో రాష్ట్రపతి తాను నివేదిక ఇచ్చానని ఆయన చెప్పారు. త్వరలో వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. "ఆ అదృశ్య శక్తికి చెబుతున్నా. మా మంత జోలికి రాకండి. భరతమాత ముద్దుబిడ్డ ఇక్కడే మా వెనక ఉన్నారు. గౌరవించకపోయినా ఫరవా లేదు. అవమానించకండి" అని ఆయన అన్నారు. 

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పెద్దలు మాడభూషి శ్రీధర్ ఓ లేఖ రాశారని, అది చదివితే అన్నీ తెలుస్తాయని, దేవుడి సొమ్మును కొల్లగొట్టినోడు బాగుపడినట్లు ఈ ప్రపంచంలో లేదని ఆయన అన్నారు.