న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అంత ప్రేమ ఉందా అని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆయన జగన్ ను డిమండ్ చేశారు. అందుకు తాను కూడా సహకరిస్తానని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గతంలో ప్రత్యేక హోదాపై రాజీనామా 

ఎన్డీఎలో చేరాలని బిజెపి కోరుతున్నట్లు వైసీపీ నేతలు కట్టుకథలు చెబుతున్నారని ఆయన అన్నారు. ఎన్డీఎలోకి ఆహ్వానిస్తున్నట్లు కొన్ని చానెళ్లలో, పత్రికల్లో ప్రచారం చేయించుకుంటే సరిపోతుందా అని ఆయన అడిగారు. ఆలయాలను నిర్మించే పార్టీ బిజెపి అని, ఆలయాలను నిర్మూలించే పార్టీ వైసీపీ అని, ఆలయాలను కూల్చే వైసీపితో బిజెపి కలస్తుందా అని ఆయన అన్నారు.

తాము మంత్రులమయ్యామని కొందరు వైసీపీ నేతలు బుస్సు కబుర్లు చెబుతున్నారని, నవంబర్ లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు అలాగే చెబుకుంటారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరాలని బిజెపి వైసీపీని ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. 

అమరావతి రైతుల ఢిల్లీ పర్యటనపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణమ రాజు విరుచుకుపడ్డారు. అమరావతి రైతులు ఢిల్లీకి విమానంలో వెళ్లడంపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రత్యేక విమానాల్లో తిరగవచ్చు గానీ రైతులు విమానాల్లో ప్రయాణించకూడదా అని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులు తమ సొంత ఖర్చులతో విమానంలో ప్రయాణించారని ఆయన చెప్పారు 

అమరావతి రైతులు టీషర్టులు ధరించడంపై మత్రులు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన మండిపడ్డారు వ్యవసాయం చేసే రైతులు బట్టలు లేకుండా తిరగాలా అని ఆయన ప్రశ్నించారు ఇలాంటి నీచమైన కుసంస్కరామైన మాటలు వద్దని ఆయన సలహా ఇచ్చారు. తాము పెద్ద తోపులమని మంత్రులు అనుకుంటున్నారని, నాలుకలు చీరుస్తారని అంటున్నారని, ప్రజలు ఎవరి నాలుకలు చీలుస్తారో తేలిపోతందని ఆయన అన్నారు.

నరేంద్ర మోడీతో జగన్ భేటీ ఫలప్రదం అంటూ సాక్షిలో వచ్చిన వార్తను ఎత్తిచూపుతూ సెటైర్లు వేశారు. మోడీతో భేటీ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడలేదని అంటూ లోపలి విషయాలు వారికి ఎలా తెలిశాయని అడిగారు. ఊహతోనో తెలుసుకునో రాసి ఉంటారని, ఈ విషయంపై ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఏం చెబుతారని ఆయన అడిగారు. 

తాను మాతృభాష పరిరక్షణ కోసం మాట్లాడానని రఘురామకృష్ణమ రాజు చెప్పారు మండలానికో పాఠశాలలో మాతృభాష చదువుకోవాలట అని ఆయన వ్యంగ్యంగా అన్నారు మాతృభాషలో చదువుకున్న నరేంద్ర మోడీ ఉన్నత స్థాయికి ఎదిగారని, ప్రపంచం మెచ్చే నాయకుడయ్యారని ఆయన అన్నారు. మోడీనే కాకుండా అమిత్ షా కూడా గుజరాతీలోనే చదువుకున్నారని ాయన అన్నారు, 

ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తనలాగా వృద్ధిలోకి వస్తారని జగన్ అనుకుంటూ ఉండవచ్చునని, కానీ ఎవరి అపాయింట్ మెంట్ కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో వారంతా మాతృభాషలోనే చదువుకున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. విద్యార్థుల సహజ హక్కులను కాలరాయవద్దని, మాతృభాషలో చదువుకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు.