గంగన్నఫిట్టింగ్ ను టిడిపి నేతలు భరించలేకపోయారు. మిగిలిన వాళ్ళతో రాజీనామాలు చేయించాల్సిన వాళ్ళు ఆపని చేయకుండా కేవలం గంగన్న రాజీనామా విషయంలో మాత్రం పట్టపట్టారు. దాంతో సమస్య ముదిరిపోయింది.  గంగన్న చేత రాజీనామా చేయించలేక చివరకు పార్టీ నుండే వేటు వేసారు.

పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గంగన్నను పార్టీ నుండి ఆరేళ్ళ పాటు పార్టీ నుండి బహిష్కరించారు. చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించినందుకు గంగన్నపై వేటు పడింది. పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గా రెండున్నరేళ్ళ తర్వాత గంగన్న రాజీనామా చేయాలి. అయితే, అందుకు ఛైర్మన్ అడ్డం తిరిగారు. ఎందుకంటే, గంగన్నతో పాటు రాజీనామా చేయాల్సిన మున్సిపల్ వైస్ ఛైర్మన్, పుట్టపర్తి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (పుడా)ఛైర్మన్, పుట్టపర్తి ఎంపిపి, సింగిల్ విండో అధ్యక్షుడు వాళ్ళు కూడా రాజీనామాలు చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానంటూ గంగన్న ఫిట్టింగ్ పెట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, గంగన్నఫిట్టింగ్ ను టిడిపి నేతలు భరించలేకపోయారు. మిగిలిన వాళ్ళతో రాజీనామాలు చేయించాల్సిన వాళ్ళు ఆపని చేయకుండా కేవలం గంగన్న రాజీనామా విషయంలో మాత్రం పట్టపట్టారు. దాంతో సమస్య ముదిరిపోయింది. గంగన్న చేత రాజీనామా చేయించలేక చివరకు పార్టీ నుండే వేటు వేసారు.