- Home
- Andhra Pradesh
- Pawan Kalyan : పవన్ 100% స్ట్రైక్ రేట్ ఫామ్ కంటిన్యూ.. జనసేన గెలిచిన స్థానాలివే, విజేతలు వీళ్లే
Pawan Kalyan : పవన్ 100% స్ట్రైక్ రేట్ ఫామ్ కంటిన్యూ.. జనసేన గెలిచిన స్థానాలివే, విజేతలు వీళ్లే
జనసేన పార్టీ మరోసారి సత్తా చాటింది. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అన్నిస్థానాల్లో విజయం సాధించిన ఈ పార్టీ తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ సాధించింది.

జనసేన 100% స్ట్రైక్ రేట్
Andhra Pradesh Municipal Elections Results 2026 : గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి లతో కలిసి పోటీచేసిన జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్ సాధించిన విషయం తెలిసిందే. అంటే పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లోనూ విజయం సాధించింది... దీంతో ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే కొందరు దీన్ని వన్ టైమ్ వండర్ అని... భవిష్యత్ లో ఈస్థాయి విజయం సాధ్యంకాదనే విమర్శించారు. ఇలాంటివారికి తాజా మున్సిపల్ ఎన్నికల ద్వారా గట్టిగా జవాభిచ్చారు జనసేనాని. మరోసారి 100% స్ట్రైక్ రేట్ సాధించి జనసేన సత్తా చాటింది.
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అద్భుత విజయం
ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్నాయి... ఇందులో భాగంగానే ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. ఇప్పటికే పోలింగ్ ముగియగా నిన్న (నవంబర్ 3, మంగళవారం) ఓట్ల లెక్కింపు జరిగింది.. పలితాలు వెలువడ్డాయి. ఇందులో అధికార టిడిపి, జనసేన, బిజెపి కూటమి అత్యధిక మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు కైవసం చేసుకుంది.
అయితే కూటమి పార్టీల్లో జనసేన మరోసారి సత్తాచాటింది. కూటమి ఒప్పందం ప్రకారం 4 మున్సిపల్ కార్పోరేషన్లు, 21 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు జనసేనకు కేటాయించారు... ఇందులో 2 కార్పోరేషన్లు, 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయితీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇలా పోటీచేసిన 20 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు విజయం సాధించారు... అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ జనసేనాని సత్తా చాటారు.
విజయవాడ, ఏలూరు మేయర్లు వీళ్లే..
కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీకి విజయవాడ, ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్లు దక్కాయి. విజయవాడలో జనసేన మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పోటీచేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈయనకు మొత్తం 2,65,888 ఓట్లు వచ్చాయి... దీంతో 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి మేయర్ సీటును దక్కించుకున్నారు. వైసిపి అభ్యర్థి భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వచ్చాయి.
ఇక విజయవాడలోని మొత్తం 86 డివిజన్లలో 76 స్థానాలు కూటమికే దక్కాయి. ఇందులో టిడిపి నుండి అత్యధికంగా 53 మంది కార్పోరేటర్లు గెలిచారు... జనసేన 19, బిజెపి 4 సీట్లు దక్కించుకున్నాయి. వైసిపి కేవలం 8 స్ధానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది... ఇతరులు 1 స్థానంలో గెలిచారు.
ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ లోనూ జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు 44,661 ఓట్ల భారీమెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ టిడిపి 35, జనసేన 13, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి… వైసిపి 3 సీట్లకే పరిమితం అయ్యింది. స్వతంత్రులు 8 డివిజన్లలో విజయం సాధించారు.
జనసేన గెలిచిన మున్సిపాలిటీలు ఇవే..
పిఠాపురం - దానం లాజర్ బాబు
అమలాపురం - నల్లా శ్రీధర్
తుని - శరగణం శ్రీలత
చిలకలూరిపేట - తోట రాజరాజేశ్వరి
ముమ్మిడివరం - గుబ్బల గంగా రత్నభవాని
గొల్లప్రోలు - కడారి తమ్మయ్యనాయుడు
సామర్లకోట - పిట్టా జానకి రామారావు
నరసాపురం - కొత్తపల్లి శైలజ
నిడదవోలు - జ్యోతి
పెడన - నాగలింగ జ్యోత్స్న రాణి
తెనాలి - తోటకూర వెంకట రామారావు
పుత్తూరు - డి. ఏలుమలై
సాలూరు - గొర్లె విజయకుమారి
తిరువూరు - పి. మాధవి
పుట్టపర్తి - మేకల ఈశ్వర్
దర్శి - దారం సుబ్బారావు
మడకశిర - గుండుమాల శారద
పాలకొండ - పల్లా విజయనిర్మల





