డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి డీఎస్పీ రామకృష్ణయ్య కుమారుడు శ్రీనివాసులు(19) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

శ్రీనివాసులు పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. గత రెండు రోజులు కాలేజీకి సెలవు రావడంతో కర్నూలుకు వెళ్లిన అతడు ఆదివారం ఇంటికి తిరిగి వచ్చాడు. కాగా సోమవారం ఉదయానికి  ఊరికి వేలాడుతూ కనిపించాడు. చదువు విషయంలో ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసు అధికారులు ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు.