టిటిడి రమణ దీక్షితులు కు పుట్టా సుధాకర్ యాదవ్ షాక్

Putta sudhakar gives shock to ramanadeekshitulu
Highlights

షాకింగ్ న్యూస్

టిటిడి పాలక మండలి పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. 65 ఏళ్లు నిండిన అర్చకులను సాగనంపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది. దీంతో తిరుమల దేవస్థానంలో సుదీర్ఘకాలంగా ప్రధాన అర్చకులుగా వెలుగొందుతున్న నలుగురు అయ్యగార్లు రిటైర్ మెంట్ తీసుకోవాల్సిన తప్పని సరి పరిస్థితి నెలకొంది.

పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన తొలి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ అర్చకులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. టిటిడి నిర్ణయంతో నలుగురు ప్రధాన అర్చుకులు పదవులు కోల్పోనన్నారు. వారిలో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుతోపాటు నరసింహ దీక్షితులు,

శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితులు ఉన్నారు. టిటిడి తీసుకున్న ఈ నిర్ణయం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ నలుగురు ప్రధాన అర్చకులు అందరూ మిరాశి వంశానికి చెందిన వారేనని టిటిడి వర్గాలు చెబుతున్నాయి.

రమణ దీక్షితులు మంగళవారం పరుశమైన భాషలో టిటిడి పెద్దలపై, ఎపి ప్రభుత్వంపై మండిపడ్డారు. పుట్టా సుధాకర్ యాదవ్ ను ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అన్యమతస్థులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారం కల్పించారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన తొలి పాలక మండలి సమావేశంలో రమణ దీక్షితులు మీద వేటు వేస్తూ టిటిడి కఠినమైన నిర్ణయం తీసుకుంది.

loader