చిత్తూరు: ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన పురుషోత్తం, పద్మజలు మానసికంగా బాగానే ఉన్నారని మదనపల్లి డీఎస్పీ మనోహరాచారి చెప్పారు.

మంగళవారం నాడు ఉదయం పురుషోత్తంనాయుడు, పద్మజలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలను నిందితులు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  పురుషోత్తంనాయుడు, పద్మజలు మానసికంగా బాగానే ఉన్నారని ఆయన చెప్పారు. అయితే ఇద్దరి మాటలు కూడ ఆద్యాత్మికంగా ఉన్నాయన్నారు.

also read:10 రోజులుగా తినలేదు,మా ఇంట్లో దేవుళ్లున్నారు,: కూతుళ్లను చంపిన పేరేంట్స్

నిందితుల విచారణను వీడియో తీసి సోషల్ మీడియాలో  పోస్టు చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని  సిఫారసు చేసినట్టుగా ఆయన తెలిపారు.నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని ఆయన చెప్పారు.

చనిపోయిన తర్వాత ఇద్దరు కూతుళ్లు బతికి వస్తారని  ఆ దంపతులు నమ్ముతున్నారు. పిల్లలన్ని చంపిన తర్వాత తాము కూడ ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నారని పోలీసుల విచారణలో తేలింది.